Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత ఆటగాళ్లంతా అమెరికా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఫినిషర్ రింకూ సింగ్ కూడా యూఎస్‌కు చేరుకున్నాడు. మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోయినా నిరాశకు లోనవకుండా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత ఆటగాళ్లంతా అమెరికా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఫినిషర్ రింకూ సింగ్ కూడా యూఎస్‌కు చేరుకున్నాడు. మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోయినా నిరాశకు లోనవకుండా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం భారత ఆటగాళ్లంతా అమెరికా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఫినిషర్ రింకూ సింగ్ కూడా యూఎస్‌కు చేరుకున్నాడు. మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోయినా నిరాశకు లోనవకుండా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. గత ఏడాది కాలంగా జట్టు విజయాల్లో కీలకంగా ఉంటూ వచ్చాడు రింకూ. వన్డేలు, టీ20ల్లో నమ్మదగ్గ ప్లేయర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌కు విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ సిరీస్‌ల్లో టీమిండియా గెలుపులో అతడిదే కీరోల్. నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, భారీ సిక్సులు బాదుతుండటంతో టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు. ఫినిషర్ రోల్‌కు అతడే కరెక్ట్ అని భావించారు.
రింకూ లాంటి ఫినిషర్ జట్టులో ఉంటే అవతలి జట్లు వణుకుతాయి కాబట్టి అతడ్ని ఎలాగైనా టీ20 ప్రపంచ కప్‌కు తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ వరల్డ్ కప్ మెయిన్ స్క్వాడ్‌లో అతడికి చోటు దక్కలేదు. రిజర్వ్డ్ ప్లేయర్స్‌లో ఒకడిగా అమెరికా విమానం ఎక్కాడు రింకూ. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. టీమిండియా తరఫున అంత బాగా ఆడినా ప్రధాన జట్టులోకి తీసుకోకపోవడం దారుణమని అంటున్నారు. తాజాగా ఈ అంశంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ రియాక్ట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్లే రింకూ పరిస్థితి ఇలా తయారైందని అన్నాడు. తప్పక జట్టులో ఉండాల్సిన ప్లేయర్ అని.. కానీ అతడికి అన్యాయం జరిగిందన్నాడు. తుదిజట్టులో రింకూ ఉంటే సూపర్బ్‌గా ఉండేదన్నాడు ఆర్పీ సింగ్.
‘రింకూ సింగ్‌ను మెయిన్ టీమ్‌లోకి తీసుకోవాల్సింది. అతడి విషయంలో అలా జరిగి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే మాత్రం రింకూ స్క్వాడ్‌లో ఉండేవాడు’ అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రింకూ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. అతడికి చాలా మ్యాచుల్లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఛాన్స్ వచ్చిన కొన్నిసార్లు అతడు భారీ స్కోర్లు బాదలేకపోయాడు. వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం అతడికి మైనస్‌గా మారింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వెంకీ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్‌దీప్ సింగ్ లాంటి పవర్ హిట్టర్లను ముందు పంపడం కూడా రింకూకు శాపంగా మారింది. ఐపీఎల్‌కు ముందు వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు.. లీగ్‌లో సరైన ఛాన్సులు రాకపోవడంతో అతడు అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేదు. దీంతో అతడి స్థానంలో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను ఫినిషర్‌గా ఎంపిక చేశారు సెలెక్టర్లు.
RP Singh ” Rinku Singh should have definitely been there. I think he was unfortunate to miss out. If the Impact Player rule was not there, I think Rinku would have made it.”pic.twitter.com/xPOnm48uhF
— Sujeet Suman (@sujeetsuman1991) May 31, 2024