IND vs PAK: బుమ్రా కాదు.. టీమిండియాను గెలిపించింది అతడే! పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియాను గెలిపించింది పంత్, బుమ్రా కాదని.. అతడి వల్లే భారత్ విజయం సాధించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియాను గెలిపించింది పంత్, బుమ్రా కాదని.. అతడి వల్లే భారత్ విజయం సాధించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ విజయంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ లు కీలక పాత్రలు పోషించారని పలువురు మాజీ క్రికెటర్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అనూహ్యంగా టీమిండియాను గెలిపించింది బుమ్రా కాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. మరి పాక్ తో మ్యాచ్ లో భారత్ ను గెలిపించింది ఎవరో చూద్దాం పదండి.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో రిషబ్ పంత్ 42 పరుగులు, అక్షర్ పటేల్ 20 రన్స్ తో రాణించారు. మిగతావారు విఫలమైయ్యారు. అనంతరం 120 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో టీమిండియా బౌలర్లను ఎదుర్కొనలేక.. పూర్తి ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై, 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక ఈ విజయంలో 3 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు జస్ప్రీత్ బుమ్రా. కానీ ఈ మ్యాచ్ లో భారత్ ను గెలిపించింది బుమ్రా కాదని, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ వల్లే ఈ పోరులో టీమిండియా విజయం సాధించిందని ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

 

ఐసీసీ వెబ్ సైట్ తో పాంటింగ్ మాట్లాడుతూ..”పాక్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడు తన అనుభవాన్ని అంతా ఈ మ్యాచ్ లో ఉపయోగించాడు. ప్రతీ బౌలర్ తో తన ప్రణాళికలను విజయవంతంగా అమలుచేయించాడు. టీమిండియా బౌలర్లలో చాలా మంది ఐపీఎల్ లో అతడి కెప్టెన్సీలో ఆడినవారే. దాంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలో అతడికి బాగా తెలుసు. 120 పరుగుల స్వల్ప టార్గెట్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో రోహిత్ సారథ్యాన్ని మెచ్చుకోవాల్సిందే” అంటూ హిట్ మ్యాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆసీస్ లెజెండ్. మరి పాంటింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Show comments