Nidhan
టీమిండియాతో సూపర్-8లో తలపడనుంది ఆఫ్ఘానిస్థాన్. గ్రూప్ దశలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో డేంజరస్‌గా మారిన ఆఫ్ఘాన్.. భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని చూస్తోంది.
టీమిండియాతో సూపర్-8లో తలపడనుంది ఆఫ్ఘానిస్థాన్. గ్రూప్ దశలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో డేంజరస్‌గా మారిన ఆఫ్ఘాన్.. భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని చూస్తోంది.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్ జట్టు తాను పసికూనను కాను.. ప్రమాదకర జట్టునని మరోమారు నిరూపించుకుంది. గత వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ టీమ్.. అదే ఆటతీరును పొట్టి కప్పులోనూ కొనసాగిస్తోంది. టీ20 ప్రపంచ కప్-2024లో గ్రూప్ స్టేజ్‌లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో సూపర్-8కు క్వాలిఫై అయింది రషీద్ సేన. వరుసగా ఉగాండా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా టీమ్స్‌ను చిత్తు చేసింది. ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన కివీస్‌ను ఆఫ్ఘాన్ ఓడిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ జట్టు మ్యాజిక్ చేసి చూపించింది. మూడు విజయాలు సాధించిన ఈ ఏషియా టీమ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ చేతుల్లో ఓటమిపాలైంది. అయినా సూపర్ పోరుకు అర్హత కావడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు.
లీగ్ స్టేజ్‌లో ఆడిన విధంగానే సూపర్-8లో సత్తా చాటాలని ఆఫ్ఘానిస్థాన్ పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాను ఎలాగైనా ఓడించాలని భావిస్తోంది. కరీబియన్ పిచ్‌లపై గ్రూప్ దశ మ్యాచ్‌లతో అలవాటు పడటం, స్పిన్ దళం సూపర్ ఫామ్‌లో ఉండటంతో రోహిత్ సేనకు షాక్ ఇవ్వగలమని ఆఫ్ఘాన్లు నమ్ముతున్నారు. అయితే ఆ టీమ్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాత్రం ఓ భారత బ్యాటర్‌కు భయపడుతున్నాడు. అతడికి బౌలింగ్ చేయడం తమ వల్ల కాదని అంటున్నాడు. రషీద్‌లో అంతగా గుబులు పుట్టిస్తున్న ఆ ఆటగాడు మరెవరో కాదు.. కింగ్ కోహ్లీ. పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే విరాట్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని రషీద్ చెప్పాడు. అతడ్ని ఆపడం అంత ఈజీ కాదన్నాడు.
‘భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఎంత క్లిష్టమైన బంతుల్ని అయినా అలవోకగా ఎదుర్కోగల సత్తా అతడి సొంతం. మనం ఎంత బాగా బౌలింగ్ చేసినా ఎలాగోలా పరుగులు చేసే మార్గాన్ని అతడు కనుగొంటాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతాడు. అతడో వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతడ్ని ఆపడం చాలా కష్టం’ అంటూ విరాట్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు రషీద్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఆఫ్ఘాన్ సారథి మెచ్చుకున్నాడు. పుల్ షాట్ ఆడటంలో హిట్‌మ్యాన్ దిట్ట అని చెప్పాడు. అతడిలా పుల్ షాట్ ఆడే బ్యాటర్ వరల్డ్ క్రికెట్లో మరొకరు లేరంటూ ఆకాశానికెత్తేశాడు. రషీద్ వ్యాఖ్యలపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. భారత స్టార్లకు రషీద్ ఇచ్చే రెస్పెక్ట్ అది అని.. గ్రౌండ్లో ప్రత్యర్థుల్లా ఉన్నా బయట మంచి బాండింగ్ ఉండటం ముఖ్యమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీని ఆపలేమంటూ రషీద్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Rashid Khan said, “it’s hard to bowl to Virat Kohli. He always finds the gap to score runs and puts the pressure on you, he’s a world class player”. (Star Sports). pic.twitter.com/PrsxyIrOjY
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024