iDreamPost
android-app
ios-app

సూపర్-8కు ముందు ఆ భారత బ్యాటర్​పై రషీద్ ఖాన్ ప్రశంసలు.. అలా ఆడలేమంటూ..!

  • Published Jun 18, 2024 | 7:34 PM Updated Updated Jun 18, 2024 | 7:34 PM

టీమిండియాతో సూపర్ పోరుకు సిద్ధమవుతోంది ఆఫ్ఘానిస్థాన్. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ భారత బ్యాటర్​లా ఆడటం ఎవరి వల్లా కాదన్నాడు.

టీమిండియాతో సూపర్ పోరుకు సిద్ధమవుతోంది ఆఫ్ఘానిస్థాన్. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ భారత బ్యాటర్​లా ఆడటం ఎవరి వల్లా కాదన్నాడు.

  • Published Jun 18, 2024 | 7:34 PMUpdated Jun 18, 2024 | 7:34 PM
సూపర్-8కు ముందు ఆ భారత బ్యాటర్​పై రషీద్ ఖాన్ ప్రశంసలు.. అలా ఆడలేమంటూ..!

ఆఫ్ఘానిస్థాన్.. కొన్నేళ్ల కింద వరకు ఆ జట్టును అంతా పసికూనలా చూసేవారు. ఆ టీమ్ ఆటతీరు కూడా అందుకు తగ్గట్లే దారుణంగా ఉండేది. అయితే చూస్తూ ఉండగానే డేంజరస్ సైడ్​గా మారింది ఆఫ్ఘాన్. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, రెహ్మానుల్లా గుర్బాజ్, ఒమర్జాయి లాంటి ప్లేయర్లు వరల్డ్ క్లాస్ స్టాండర్స్​ను అందుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టి లీగ్స్​లో ఆడుతూ తమ టాలెంట్​ను పెంచుకున్నారు. దీంతో ఆఫ్ఘాన్ టీమ్ పటిష్టంగా మారింది. గత వన్డే వరల్డ్ కప్​లో పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక లాంటి బిగ్ టీమ్స్​కు షాక్ ఇచ్చిందా జట్టు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. అదే జోరును ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్​లోనూ కంటిన్యూ చేస్తోంది.

పొట్టి కప్పులో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సూపర్-8లోకి దర్జాగా అడుగుపెట్టింది రషీద్ సేన. మొదటి మూడు మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఫేవరెట్లలో ఒకటైన పటిష్టమైన న్యూజిలాండ్​ను చిత్తు చేసింది. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్​లో ఆతిథ్య వెస్టిండీస్ చేతుల్లో మాత్రం ఓడింది. ఈ ఒక్క మ్యాచ్​ను మినహాయిస్తే ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘాన్ల జోరు మామూలుగా లేదు. క్వాలిటీ స్పిన్ బౌలింగ్, దూకుడైన బ్యాటింగ్​తో అపోజిషన్ టీమ్స్​ను భయపెడుతోంది రషీద్ సేన. సూపర్ పోరులో భాగంగా తొలి మ్యాచ్​లో టీమిండియాను ఎదుర్కోనుందా జట్టు. ఈ సందర్భంగా ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత సారథి రోహిత్ శర్మపై అతడు ప్రశంసల జల్లులు కురిపించాడు.

రోహిత్ అద్భుత బ్యాటర్ అంటూ మెచ్చుకున్నాడు రషీద్ ఖాన్. హిట్​మ్యాన్​ కొట్టే పుల్​ షాట్​కు తాను ఫ్యాన్​ను అని చెప్పాడు. ఆ పుల్​ షాట్ వరల్డ్​లోనే బెస్ట్ అంటూ రోహిత్​ను ఆకాశానికెత్తేశాడు. అలా ఎవరూ ఆడలేరని చెప్పాడు. విండీస్​తో మ్యాచ్​లో ఓటమి మీద కూడా రషీద్ రియాక్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్​లో వెస్టిండీస్ సూపర్బ్​గా ఆడిందని, ముఖ్యంగా పవర్​ప్లేలో వాళ్లకు మంచి స్టార్ట్ దొరికిందన్నాడు. ఈ మ్యాచ్​లో ఓడటం బాధ కలిగించినా.. దీని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్పాడు. అయితే సూపర్​-8కు క్వాలిఫై అయ్యామని.. ఈ స్టేజ్​లో ఓడితే ఓకే గానీ నెక్స్ట్ అన్నీ డూ ఆర్ డై మ్యాచ్​లేనని పేర్కొన్నాడు. మరి.. రోహిత్ బ్యాటింగ్ ఇష్టమంటూ రషీద్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.