Nidhan
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ పండుగ త్వరలో మొదలవనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే తమ టీమ్‌ను న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వినూత్నంగా స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేసింది కివీస్.
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ పండుగ త్వరలో మొదలవనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే తమ టీమ్‌ను న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వినూత్నంగా స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేసింది కివీస్.
Nidhan
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ సంరంభం త్వరలో మొదలవనుంది. ఇప్పుడు అందరూ ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. కానీ మెగా లీగ్ ముగిసిన వెంటనే పొట్టి కప్ సందడి షురూ కానుంది. ప్రపంచ కప్ ఆరంభానికి ఇంకా నెల రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో అన్ని దేశాలు టీమ్ సెలెక్షన్ మీద ఫోకస్ పెట్టాయి. రాబోయే వారం రోజుల్లో దాదాపుగా అన్ని కంట్రీస్ తమ స్క్వాడ్స్‌ను ప్రకటించనున్నాయి. ఇవాళ న్యూజిలాండ్ తమ వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వినూత్నంగా జట్టును అనౌన్స్ చేసింది కివీస్.
టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ ఆటగాళ్ల వివరాలను వెరైటీగా ప్రకటించారు. ఇద్దరు చిన్నారులు ప్రెస్ మీట్లో ఈ డీటెయిల్స్ వెల్లడించారు. టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలో తమ జట్టు పొట్టి వరల్డ్ కప్ బరిలోకి దిగనుందని ఆంగస్, మటిల్డా అనే ఆ ఇద్దరు చిన్నారులు తెలిపారు. 15 మందితో కూడిన టీమ్‌లోని ఒక్కో ప్లేయర్ పేర్లు చెబుతూ ఆఖర్లో మీడియా నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అని ఆ చిన్నారులు అడిగేసిరికి అక్కడ ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. సాధారణంగా ప్రపంచ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్‌కు టీమ్ అనౌన్స్మెంట్ సమయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు, టీమ్ మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తులు పాల్గొంటారు. కానీ కివీస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకుంది.
వరల్డ్ కప్‌లో ఆడబోయే న్యూజిలాండ్ టీమ్‌ను అనౌన్స్ చేసిన చిన్నారులు ఆంగస్, మటిల్డా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. వీళ్ల వీడియోను చూసిన నెటిజన్స్ కివీస్ ఐడియా సూపర్బ్ అని, ఎవరూ చేయని విధంగా చాలా డిఫరెంట్‌గా జట్టును ప్రకటించారని మెచ్చుకుంటున్నారు. ఇక, బ్లాక్‌కాప్స్ స్క్వాడ్ విషయానికొస్తే.. విలియమ్సన్తో పాటు ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ జట్టులో ఉన్నారు. ఇంజ్యురీస్‌తో ఇబ్బంది పడుతున్న పేసర్ కైల్ జెమీసన్, ఆల్‌రౌండర్ ఆడమ్ మిల్నే ప్రపంచ కప్‌కు దూరమయ్యారు. మరి.. కివీస్ వరల్డ్ కప్ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
New Zealand always finds a special way to announce their World Cup squad. 😄👌pic.twitter.com/3aPcuUgSak
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2024
New Zealand’s T20 World Cup squad:
Williamson (C), Allen, Boult, Bracewell, Chapman, Conway, Ferguson, Henry, Mitchell, Neesham, Phillips, Rachin, Santner, Sodhi and Southee. pic.twitter.com/AvMgaErO1p
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2024