Somesekhar
టీ20 వరల్డ్ కప్ ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. పసికూన చేతిలో దారుణంగా ఓడిపోయి.. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. పసికూన చేతిలో దారుణంగా ఓడిపోయి.. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇక ఈ మెగాటోర్నీలో భాగంగా ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ సంచలనం నమోదు అయ్యింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది పసికూన నెదర్లాండ్స్. వార్మప్ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎన్నో ఆశలతో టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది పసికూన నెదర్లాండ్స్. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టులో మైఖేల్ లెవిట్ 28 బంతుల్లో 55 పరుగుల థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. లెవిట్ కు తోడుగా తేజ నిడమనూరు(27), కెప్టెన్ స్క్వాట్ ఎడ్వర్డ్(27*) రాణించారు. అనంతరం 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంకు ఆదిలోనే షాకిచ్చారు డచ్ బౌలర్లు. దాంతో పవర్ ప్లే ముగిసేలోపే 30 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత ఏదశలోనూ లంక విజయం దిశగా సాగలేదు. డచ్ బౌలర్ల ధాటికి 18. 5 ఓవర్లకు 161 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో హసరంగా 15 బంతుల్లో 45 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డి సిల్వా(31), దసున్ షణక(35*) రన్స్ చేశారు. డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. వరల్డ్ కప్ ముందు పసికూన చేతిలో చిత్తై ఆత్మవిశ్వాన్ని దెబ్బతీసుకుంది. ఇక లంక తమ రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడబోతోంది. విండీస్ పై టీ20 సిరీస్ నెగ్గి సూపర్ ఫామ్ లో ఉన్న ఐర్లాండ్ ను లంక ఏ విధంగా నిలువరిస్తుందో చూడాలి. మరి వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే సంచలం నమోదు కావడంతో ఈ టోర్నీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరి పసికూన చేతిలో లంక చిత్తు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰
Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6
— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024