Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో దుమ్మురేపుతోంది టీమిండియా. గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన.. సూపర్-8 జర్నీని కూడా సూపర్బ్‌గా స్టార్ట్ చేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో దుమ్మురేపుతోంది టీమిండియా. గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన.. సూపర్-8 జర్నీని కూడా సూపర్బ్‌గా స్టార్ట్ చేసింది.
Nidhan
పొట్టి కప్పులో భారత జట్టు బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకుపోతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కప్పు మాదే.. ఎవరు ఆపుతారో చూస్తామంటూ హెచ్చరికలు పంపుతోంది. ఎదురొచ్చిన టీమ్‌ను తొక్కుకుంటూ టైటిల్ రేసులో పరుగులు తీస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విక్టరీస్‌తో సత్తా చాటిన రోహిత్ సేన.. అదే ఊపును సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. ఆఫ్ఘానిస్థాన్‌తో నిన్న జరిగిన సూపర్ పోరులో ఏకంగా 47 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ ఓవర్లన్నీ ఆడి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 134 పరుగులకే పరిమితమైంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా దుమ్మురేపడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో భారత బౌలర్ల హవా సాగుతోంది. మొదటి మ్యాచ్ నుంచి వాళ్ల డామినేషన్ నడుస్తోంది. అందుకే బ్యాటర్లు ఫెయిలైనా మన టీమ్ గెలుస్తూ వస్తోంది. జట్టులో ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అద్భుతమనే చెప్పాలి. కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్న పేసుగుర్రం.. అవతల ఉన్నది ఎంత తోపు బ్యాటర్ అయినా సరే వణికిస్తున్నాడు. బుల్లెట్ పేస్‌తో అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు, స్వింగ్ డెలివరీస్కు అపోజిషన్ టీమ్ బ్యాటర్ల దగ్గర ఆన్సర్ ఉండటం లేదు. నిన్న ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ అతడు ఇదే విధంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడి దెబ్బకు బంతిని టచ్ చేయాలన్నా బ్యాటర్లు భయపడ్డారు. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు లెజెండరీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. బుమ్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటోడు అని మెచ్చుకున్నాడు.
‘బుమ్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటోడు. అతడు పూర్తిగా సేఫ్. ఎంతో నమ్మదగిన ఆటగాడు. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే అతడి చేతికి బంతిని ఇస్తే వికెట్లు తీస్తాడు. గేమ్‌ను భారత్‌కు అనుకూలంగా మారుస్తాడు. నిన్నటి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే 12 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘానిస్థాన్కు స్టార్టింగ్‌లోనే మూమెంటమ్ దొరికింది. కానీ బుమ్రా రెండో ఓవర్ వేసేందుకు దిగగానే మ్యాచ్‌ను సెట్ చేశాడు. వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అతడు పవర్‌ప్లేలోనే 6 స్లో డెలివరీస్ వేశాడు. దీంతో బ్యాటర్లు బ్యాక్ స్టెప్‌లోకి వెళ్లారు. ప్రస్తుత క్రికెట్లో బుమ్రా మాదిరిగా బౌలింగ్ టోన్ సెట్ చేయడం మరే బౌలర్ వల్లా కాదు. స్లోవర్ బాల్స్, బౌన్సర్స్ వేస్తూనే ఆఖర్లో రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లకు పోయిస్తున్నాడు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే అందులో బుమ్రా కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. మరి.. బుమ్రా భారత్‌కు ఆర్బీఐ లాంటోడనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Irfan Pathan “Jasprit Bumrah is like the Reserve Bank of India.He is absolutely safe,You expect him to perform when he bowls four overs in any situation.He sets up the game.He gets the little reverse also and it will be a big factor if India wins the WC.”pic.twitter.com/HTidkARQax
— Sujeet Suman (@sujeetsuman1991) June 21, 2024