iDreamPost

ఆసీస్ పై అలా ఓడిపోతే.. టీమిండియా ఇంటికే! ఈ లెక్కలు చూస్తే ఫ్యాన్స్ లో వణుకే..

ఆసీస్ పై ఆఫ్గాన్ సంచలన విజయం సాధించడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. దాంతో ఆస్ట్రేలియాపై జరిగే మ్యాచ్ లో టీమిండియా అలా ఓడిపోయి.. ఆఫ్గాన్ అలా గెలిస్తే.. భారత్ ఇంటికి వెళ్లక తప్పదు. ఆ లెక్కలు ఓసారి పరిశీలిద్దాం.

ఆసీస్ పై ఆఫ్గాన్ సంచలన విజయం సాధించడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. దాంతో ఆస్ట్రేలియాపై జరిగే మ్యాచ్ లో టీమిండియా అలా ఓడిపోయి.. ఆఫ్గాన్ అలా గెలిస్తే.. భారత్ ఇంటికి వెళ్లక తప్పదు. ఆ లెక్కలు ఓసారి పరిశీలిద్దాం.

ఆసీస్ పై అలా ఓడిపోతే.. టీమిండియా ఇంటికే! ఈ లెక్కలు చూస్తే ఫ్యాన్స్ లో వణుకే..

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా టీమ్స్ సెమీస్ కు చేరాయి. అయితే గ్రూప్ 1 నుంచి ఇండియా, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకుంటాయని అందరూ భావించారు. కానీ ఆసీస్ పై ఆఫ్గానిస్తాన్ అనూహ్య విజయం సాధించడంతో.. లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. ఆఫ్గాన్ విజయం సాధించడం.. భారత్ సెమీస్ చేరే అవకాశాలపై పాక్షిక ప్రభావం చూపింది. నేడు(జూన్ 24) ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భారత్ అలా ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. మరి ఆ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఆస్ట్రేలియాపై ఆఫ్గానిస్తాన్ విజయం సాధించడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓడిపోయి ఉంటే.. భారత జట్టు నేరుగా సెమీస్ కు వెళ్లేది. ఎందుకంటే? భారత్ కు ఆస్ట్రేలియాకు మాత్రమే 4 పాయింట్లు ఉంటాయి. మిగతా జట్లకు నాలుగు పాయింట్లు సాధించే అవకాశం ఉండేది కాదు. కానీ ఒక్క విజయంతో పరిస్థితులు తారుమారై.. ఆఫ్గాన్ కూడా సెమీస్ రేసులో నిలిచింది. అయితే టీమిండియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు లేకపోలేదు. ఆసీస్ పై విజయం సాధిస్తే.. నేరుగా సెమీస్ కు వెళ్తుంది భారత్. కానీ ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే +2.425 నెట్ రన్ రేట్ తో ఉన్న టీమిండియా నాకౌట్ అయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంది.

india vs australia match

కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టీమిండియా ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాలంటే? ఆస్ట్రేలియా చేతిలో 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. మరోవైపు బంగ్లాదేశ్ పై ఆఫ్గానిస్తాన్ 81 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పుడే ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. దాంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే ఇలా జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. దాన్నే ఆసీస్ తో జరిగే మ్యాచ్ లో చూపించి విజయం సాధించాలని ఆరాటపడుతోంది. ఇక ఆఫ్గాన్ పై ఓటమి తర్వాత ఆసీస్ లో కొంత ఆత్మ విశ్వాసం లోపించింది. ఇది భారత్ కు సానుకూలం. అదీకాక బంగ్లాదేశ్ పై ఆఫ్గాన్ 81 పరుగులకు పైగా తేడాతో నెగ్గడం అంటే కష్టమనే చెప్పాలి. కానీ క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్నారు క్రీడా నిపుణులు. అయితే ఈ లెక్కలు మాత్రం టీమిండియా ఫ్యాన్స్ ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి