వరల్డ్ కప్​కు ముందు భారత్​ను రెచ్చగొడుతున్న అఫ్రిదీ.. ఎంత చేసినా ఓటమి తప్పదు!

ఐపీఎల్-2024 సందడి ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ టీ20 వరల్డ్ కప్ వైపు మళ్లింది. మరో ఐద్రోజుల్లో మెగా టోర్నీ మొదలుకానుంది. దీంతో టీమిండియాను రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.

ఐపీఎల్-2024 సందడి ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ టీ20 వరల్డ్ కప్ వైపు మళ్లింది. మరో ఐద్రోజుల్లో మెగా టోర్నీ మొదలుకానుంది. దీంతో టీమిండియాను రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.

ఐపీఎల్-2024 సందడి ముగిసింది. నెలన్నర పాటు క్రికెట్ లవర్స్​ను ఎంతగానో ఎంటర్​టైన్ చేసిన క్యాష్ రిచ్ లీగ్​ పూర్తయింది. ఈసారి కోల్​కతా నైట్ రైడర్స్​ ఛాంపియన్​గా నిలిచింది. లీగ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ టీ20 వరల్డ్ కప్-2024పై షిఫ్ట్ అయింది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా ఐద్రోజులు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు యూఎస్​ఏకు చేరుకున్నాయి. ఆటగాళ్లందరూ ప్రాక్టీస్​లో మునిగిపోయారు. అమెరికాలోని వాతావరణానికి అలవాటు పడుతున్నారు. మెయిన్ మ్యాచ్​లకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్​లు ఆడి సన్నద్ధం కానున్నారు. ఈ వరల్డ్ కప్​లో మోస్ట్ ఎగ్జయిటింగ్ మ్యాచ్​గా భారత్- పాకిస్థాన్ మధ్య పోరు నిలవనుంది. జూన్ 9వ తేదీన ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి.

ఇండియా-పాకిస్థాన్ ఫైట్ కోసం క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్​లో భారత్​కు పాక్​పై సూపర్బ్ రికార్డు ఉంది. ఐసీసీ టోర్నీల్లో దాయాదిని చిత్తు చేయడం మనకు అలవాటుగా మారింది. ఈ మధ్య ఆసియా కప్ నుంచి వన్డే ప్రపంచ కప్-2023 వరకు పాక్ ఎదురొచ్చినప్పుడల్లా భారత్ తొక్కిపడేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ టీమ్​లో ఉండటంతో మనతో మ్యాచ్ అంటేనే దాయాదులు వణుకుతున్నారు. అందుకే పొట్టి కప్పు మొదలవక ముందే రెచ్చగొట్టడం స్టార్ట్ చేసేశారు. పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ భారత్​ను టీజ్ చేస్తూ కామెంట్స్ చేశాడు. మన జట్టు చేతిలో ఓడిన మ్యాచ్ గురించి కాకుండా గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ గురించి చెబుతూ అతడు గొప్పలకు పోయాడు. ఇక, ఐసీసీ టోర్నీల్లో అందునా వరల్డ్ కప్స్​లో పాక్​పై భారత్​కు ఎదురులేని రికార్డు ఉంది. వన్డే ప్రపంచ కప్​లో 7-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

టీ20 వరల్డ్ కప్​లో 5-1తో భారత్ డామినేషన్ నడుస్తోంది. పొట్టి కప్పులో 2021లో ఒకేసారి దాయాది చేతుల్లో ఓడింది టీమిండియా. అదే విషయాన్ని అఫ్రిదీ హైలైట్ చేస్తూ రెచ్చగొట్టాడు. ‘నేను నా కెరీర్​లో ఎంతో సాధించా. ఎంత బాగా ఆడినా వరల్డ్ కప్​లో భారత్​ను ఓడించలేకపోయాం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. అయితే దుబాయ్​లో జరిగిన టీ20 ప్రపంచ కప్-2021లో టీమిండియాపై పాక్ నెగ్గింది. ఆ అవకాశాన్ని మిస్సయ్యాను, ఆ జట్టులో లేనని ఇప్పటికీ బాధపడుతున్నా’ అని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్.. ఒకే ఒక్క గెలుపును గుర్తుచేస్తూ రెచ్చగొడుతున్నాడని అంటున్నారు. కానీ మెగా టోర్నీలో భారత్ చేతిలో 12 సార్లు దాయాది ఓడిందని.. దాని గురించి మాట్లాడే ధైర్యం లేదని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు ఎంత ఓవరాక్షన్ చేసినా ఈసారి మళ్లీ ఓటమి తప్పదని.. పాక్​తో పోరులో భారత్​దే విజయమని చెబుతున్నారు. మరి.. భారత్-పాక్ ఫైట్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments