Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మహా సంగ్రామం మొదలయ్యేందుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీలో అన్ని మ్యాచుల కంటే ఇండో-పాక్ సమరం ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది.
టీ20 వరల్డ్ కప్-2024 మహా సంగ్రామం మొదలయ్యేందుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీలో అన్ని మ్యాచుల కంటే ఇండో-పాక్ సమరం ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మహా సంగ్రామం మొదలయ్యేందుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీలో అన్ని మ్యాచుల కంటే ఇండో-పాక్ సమరం ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి టాప్ టీమ్స్ కూడా ఉన్నాయి. కానీ వాటి మధ్య మ్యాచ్ కంటే భారత్-పాక్ ఫైట్ మీదే అందరి ఫోకస్ నెలకొంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడం, అందులోనూ వరల్డ్ కప్‌లో తలపడుతుండటంతో ఎక్కడ లేని హైప్ నెలకొంది. మెగా టోర్నీలో దాయాది మీద టీమిండియాకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. దాన్నే కొనసాగించాలని చూస్తోంది. అయితే రోహిత్ సేనకు షాకివ్వాలని పాక్ భావిస్తోంది. ఈ ఇరు జట్ల మధ్య పోరుకు అమెరికాలోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్-పాకిస్థాన్ ఫైట్‌కు వేదికగా నిలవనున్న నసావు ఇంటర్నేషనల్ స్టేడియం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ లీగ్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది రోహిత్ సేన. దీంతో ఈ గ్రౌండ్ టీమిండియాకు అచ్చొస్తుందా? పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో నసావు స్టేడియానికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫిబ్రవరిలో తీసిన ఈ గ్రౌండ్ ఫొటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడిన స్టేడియం మూడ్నెళ్ల గ్యాప్‌లో సర్వాంగ సుందరంగా ఎలా తయారైంది? టాప్ స్టేడియమ్స్ను తలదన్నే రీతిలో ఎలా రూపొందించారు? అని అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు మంచు బాగా కురుస్తుంది. చలికాలంలో అక్కడ అడుగు బయట పెట్టడానికి కూడా జనాలు వణుకుతారు. ఎముకలు కొరికే చలి, మంచు కురవడంతో పలు మార్లు జనజీవనం స్తంభించడం చూస్తూనే ఉంటాం. అలా కురిసిన మంచు వల్ల నసావు స్టేడియం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అయితే ప్రపంచ కప్‌కు ఎక్కువ టైమ్ లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంచు తగ్గిన వెంటనే చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన గ్రౌండ్ మరమ్మతు పనులు చేపట్టారు. ఒకప్పుడు ఫుట్‌బాల్ స్టేడియం అయిన నసావును క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఓడల ద్వారా తెప్పించిన పిచ్‌లను అమర్చారు. ఆడియెన్స్ కోసం చుట్టూ స్టాండ్స్ నిర్మించారు. దీంతో ఇప్పుడు అది క్రికెట్ స్టేడియంగా మారిపోయింది. మరి.. నసావు స్టేడియం భారత్‌కు అచ్చొస్తుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
New York Stadium in February Vs New York Stadium in May. (Espncricinfo). 🤯 pic.twitter.com/lCmaKwTcmB
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024