Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది ఫేవరెట్ టీమిండియా. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది రోహిత్ సేన.
టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది ఫేవరెట్ టీమిండియా. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది రోహిత్ సేన.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 వేటను మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది టీమిండియా. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో ఓటమితో కసిగా ఉన్న రోహిత్ సేన.. పొట్టి కప్పును ఎగరేసుకుపోవాలని డిసైడ్ అయింది. ఇవాళ ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో వరల్డ్ కప్ వేటను స్టార్ట్ చేయనుంది. ఈ రెండు టీమ్స్ మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పసికూన అని ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ లాంటి బడా జట్లకు షాక్ ఇచ్చిన చరిత్ర ఐర్లాండ్ సొంతం. అందుకే ఆ టీమ్‌ను లైట్ తీసుకోవడం లేదు టీమిండియా. ఈ తరుణంలో ఐరిష్ టీమ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
భారత జట్టులోని ఆ స్టార్ క్రికెటర్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అన్నాడు. అతడి బ్యాటింగ్ టాలెంట్ సూపర్బ్ అని.. అతడో అద్భుతమంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. స్టిర్లింగ్ మెచ్చుకుంది మరెవర్నో కాదు.. టీమిండియా టాప్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనే. లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల్లో నుంచి బ్యాటన్‌ను తీసుకొని భారత జట్టు బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ మోస్తున్న తీరు సూపర్బ్ అని ప్రశంసలు కురిపించాడు స్టిర్లింగ్. దశాబ్దంన్నర కాలంగా అతడు నిలకడగా ఆడుతున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. ఇంతకాలం పాటు ప్యాషన్‌తో ఆడుతూ తన బెస్ట్‌ను ఇవ్వడం మామూలు విషయం కాదన్నాడు ఐర్లాండ్ సారథి.
‘కోహ్లీ గొప్ప బ్యాటర్. సచిన్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అతడు ఆడుతున్న తీరు అద్భుతం. అతడిలా కన్సిస్టెంట్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం. ఆ టీమ్‌తో ఆడటం సవాల్‌తో కూడుకున్నది. ఆ జట్టులో టాప్ బ్యాటర్లు, టాప్ బౌలర్లు ఉన్నారు. అందునా ఐపీఎల్లో రాణించి వస్తున్నారు. వాళ్లు హయ్యెస్ట్ క్రికెట్ స్టాండర్డ్స్‌తో ఆడతారని మాకు తెలుసు. అయితే మేం కూడా మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో బాగా ఆడాలని అనుకుంటున్నాం. టీమిండియా మీద బెస్ట్ ఇస్తే గ్రూప్ దశలోని మిగతా మూడు మ్యాచుల్లోనూ అదే కాన్ఫిడెన్స్‌తో ఆడొచ్చు’ అని పాల్ స్టిర్లింగ్ చెప్పుకొచ్చాడు. ఈ గ్రూప్ చాలా కఠినంగా ఉందని, ఇక్కడ గెలిచి ముందుకు వెళ్లడం అంత ఈజీ కాదన్నాడు. తాము ఆడే మ్యాచుల్లో ఇండియాతో మ్యాచే అత్యంత క్లిష్టమైనదని ఐర్లాండ్ కెప్టెన్ స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీ గురించి స్టిర్లింగ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Paul Stirling said “Seeing Virat Kohli come in sort of take that baton of Sachin Tendulkar & go to World Cricket is amazing to watch. His passion and drive to be the best for a long period of time is Amazing”. [Press] pic.twitter.com/C1UpkZLthQ
— Johns. (@CricCrazyJohns) June 4, 2024