IND vs BAN మ్యాచ్.. కుల్దీప్ పై ఫైర్ అయిన రోహిత్! వీడియో వైరల్..

సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి బలైయ్యాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి బలైయ్యాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు సహనం కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం. క్యాచ్ మిస్ చేసినా.. భారీగా పరుగులు ఇచ్చినా.. చెత్త షాట్లకు ఔట్ అయినా.. కెప్టెన్ తన నోటికి పనిచెబుతూ ఉంటాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి కుల్దీప్ పై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సూపర్ 8లో రెండో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంది. అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. గ్రూప్ 1 టేబుల్ టాపర్ గా నిలిచింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ ఆగ్రహానికి బలైయ్యాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అసలేం జరిగిందంటే? బంగ్లా టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేయడానికి వచ్చాడు కుల్దీప్. ఈ ఓవర్లో తొలి బంతినే భారీ సిక్సర్ గా బాదాడు షకీబ్ అల్ హసన్. ఆ తర్వాత బంతిని రివర్స్ స్వీప్ ఆడే క్రమంలో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు షకీబ్.

అనంతరం క్రీజ్ లోకి  మహ్మదుల్లా వచ్చాడు. అతడికి గుగ్లీ సంధించాడు కుల్దీప్. అంతే రోహిత్ కు పట్టరాని కోపం వచ్చింది. “ఏం చేస్తున్నావ్ కుల్దీప్? అతడిని స్వీప్ ఆడనివ్వు.. ఇప్పుడే అలా ఆడి ఒకరు ఔట్ అయ్యారు కదా? అలాంటి బంతులే సంధించు” అని కోపంగా చెప్పాడు రోహిత్. ఇదంతా స్టంప్ మైక్ లో రికార్డు అయ్యింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో కోహ్లీ(37), పంత్(36), శివమ్ దూబే(34) రన్స్ తో రాణించారు. ఆ తర్వాత 197 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితం అయ్యి.. 50 రన్స్ తేడాతో ఓడిపోయింది.

Show comments