iDreamPost
android-app
ios-app

IND vs AUS: మ్యాచ్ గెలిచినా ఇండియా బౌలర్స్ చేసిన తప్పు.. ఇలా అయితే వరల్డ్ కప్ కష్టమే!

  • Published Jun 25, 2024 | 10:01 AM Updated Updated Jun 25, 2024 | 10:01 AM

ఆస్ట్రేలియాపై మ్యాచ్ గెలిచినప్పటికీ.. టీమిండియా బౌలర్లు ఓ తప్పు చేశారు. బుమ్రాతో సహా.. మిగతా బౌలర్లు కూడా ఇందులో భాగమే. దాంతో ఇలా అయితే.. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ కష్టమే అంటున్నారు క్రీడా నిపుణులు. మరి ఇంతకీ భారత బౌలర్లు చేసిన మిస్టెక్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఆస్ట్రేలియాపై మ్యాచ్ గెలిచినప్పటికీ.. టీమిండియా బౌలర్లు ఓ తప్పు చేశారు. బుమ్రాతో సహా.. మిగతా బౌలర్లు కూడా ఇందులో భాగమే. దాంతో ఇలా అయితే.. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ కష్టమే అంటున్నారు క్రీడా నిపుణులు. మరి ఇంతకీ భారత బౌలర్లు చేసిన మిస్టెక్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

IND vs AUS: మ్యాచ్ గెలిచినా ఇండియా బౌలర్స్ చేసిన తప్పు.. ఇలా అయితే వరల్డ్ కప్ కష్టమే!

లోపాలను సరిదిద్దుకుంటూ.. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ.. ముందుకు వెళ్తేనే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. అలా కాదని గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు వెళ్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మాటలు అన్నీ టీమిండియా గురించే. అదేంటి టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోందిగా? ఇప్పుడు ఈ ఉపన్యాసాలు ఎందుకు? అని మీకు అనుమానం రావొచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 24 పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో మన బౌలర్లు కొన్ని తప్పులు చేశారు. ఆ మిస్టేక్స్ ను సరిదిద్దుకోకపోతే.. వరల్డ్ కప్ కష్టమే అంటున్నారు క్రీడా నిపుణులు, టీమిండియా ఫ్యాన్స్. మరి ఆసీస్ తో మ్యాచ్ లో బుమ్రాతో సహా.. బౌలర్లు చేసిన తప్పు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.

ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) పరుగులు చేసి, కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే 206 రన్స్ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో.. ఓ దశలో టీమిండియాకు ఓటమి తప్పేలా లేదనిపించింది. కానీ ఎలాగోలా చివర్లో పుంజుకున్న భారత బౌలర్లు ఆసీస్ ను 181 పరుగులకు నిలువరించారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఓ తప్పు చేశారు. ఆ మిస్టెక్ ను సరిదిద్దుకోకపోతే.. కప్ కష్టమే అంటున్నారు.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారత్ కు కొరకరాని కొయ్యగా మారాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపిన అతడు.. ఈ సీజన్ లో ఓ మోస్తారుగా ఆడుతున్నాడు. కానీ భారత్ తో మ్యాచ్ అంటే మాత్రం అతడికి పూనకాలే వస్తాయి. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కూడా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో హెడ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. తాజా మ్యాచ్ లో సైతం 43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 76 పరుగులు చేశాడు. అతడు ఔట్ కాకుండా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోయేదే. అయితే ఇక్కడే భారత బౌలర్లు ఓ తప్పు చేస్తున్నారు.

ట్రావిస్ హెడ్ కు ఓ బలహీనత ఉంది. ఆ విషయం ఈ ఐపీఎల్ లో మిచెల్ స్టార్క్ ద్వారా బయటపడింది. అదేంటంటే? హెడ్ కు హాఫ్ స్టిక్ బంతులు వేస్తే ఆడలేడు. ఈ బలహీనతను టీమిండియా బౌలర్లు క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఒక ఆటగాడి బలహీనత ఏంటో కూడా తెలిసిన తర్వాత.. అతడిని భారీ స్కోర్ కొట్టేలా చేస్తున్నాం అంటే.. మనం తప్పు చేస్తున్నట్లే. ఈ మ్యాచ్ లో హెడ్ వీక్ నెస్ కు తగ్గట్లుగా బంతులు వేయడంలో బుమ్రాతో సహా.. మిగతా బౌలర్లు కూడా పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పటికైనా కళ్లు తెరచి ఓ బ్యాటర్ వీక్ నెస్ తెలిస్తే.. దాంతోనే అతడిని దెబ్బకొట్టాలని ఫ్యాన్స్, క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిచాం కాబట్టి.. ఈ తప్పు పెద్దగా తెరపైకి రావడం లేదు గానీ.. అదే హెడ్ కారణంగా ఓడిపోతే.. పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికైనా ఇలాంటి తప్పులను సరిదిద్దుకోకపోతే.. టీమిండియాకు వరల్డ్ కప్ కష్టమే!