iDreamPost

ఈ అవార్డ్ ఎవ్వరికీ ఇవ్వను.. ఎందుకంటే?: సూర్యకుమార్ యాదవ్

ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో అద్భుత హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్న సూర్యకుమార్.. తనకు వచ్చిన ఈ అవార్డ్ ను ఎవ్వరికీ ఇవ్వనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలా ఎందుకు అన్నాడో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో అద్భుత హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్న సూర్యకుమార్.. తనకు వచ్చిన ఈ అవార్డ్ ను ఎవ్వరికీ ఇవ్వనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలా ఎందుకు అన్నాడో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అవార్డ్ ఎవ్వరికీ ఇవ్వను.. ఎందుకంటే?: సూర్యకుమార్ యాదవ్

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన విజయ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. గ్రూప్ స్టేజ్ లో చూపించిన జోరును సూపర్ 8లోనూ కంటిన్యూ చేస్తోంది. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 47 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(53) సూపర్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్నాడు సూర్య. ఇక ఈ అవార్డ్ స్వీకరించే సమయంలో.. ఈ అవార్డ్ ఎవ్వరికీ ఇవ్వను అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సాధారణంగా క్రికెట్ లో మ్యాచ్ విన్నింగ్ ఫర్ఫామెన్స్ చూపించిన ప్లేయర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డును అందుకున్న వారు తమ తల్లిదండ్రులకో లేక తమ ప్రాణా స్నేహితులకో అంకితం ఇస్తుంటారు. కానీ.. ఆఫ్గాన్ తో మ్యాచ్ లో తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ ను మాత్రం ఎవ్వరికీ ఇవ్వనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. అలా ఎందుకు అన్నాడో.. కారణం కూడా చెప్పాడు ఈ స్టార్ ప్లేయర్.

“గత కొన్ని రోజులుగా నేను  పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ అవార్డ్. నా ఈ ఇన్నింగ్స్ వెనక ఎంతో కష్టం, నిరంతర శ్రమ ఉంది. అందుకే ఈ అవార్డ్ ఎవ్వరికీ ఇవ్వాలనుకోవడం లేదు. పైగా ఈ వరల్డ్ కప్ లో మా బ్యాటర్లు గెలుచుకున్న తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇది. నాకు ప్రత్యేకమైనది. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ ఆడటం ఎంతో కష్టం. అందుకే అతడి బౌలింగ్ లో చాలా పద్దతిగా ఆడాను. అతడొక వరల్డ్ క్లాస్ స్పిన్నర్. హార్దిక్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు అతడికి ఒక్కటే చెప్పాను. పిచ్ స్లోగా మారొచ్చని, బాల్ రివర్స్ స్వింగ్ అవ్వొచ్చని తెలిపాను” అంటూ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఎవ్వరికీ ఇవ్వనన్న సూర్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి