Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురైయ్యాడు జడ్డూ భాయ్. వాళ్లిద్దరు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి జడ్డూపై వారి కోపానికి కారణం ఏంటి? ఆ వివరాలు..
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురైయ్యాడు జడ్డూ భాయ్. వాళ్లిద్దరు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి జడ్డూపై వారి కోపానికి కారణం ఏంటి? ఆ వివరాలు..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో మ్యాచ్ లో కూడా తన పూర్ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. తాజాగా సూపర్ 8లో భాగంగా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో 5 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురైయ్యాడు జడ్డూ భాయ్. వాళ్లిద్దరు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి జడ్డూపై వారి కోపానికి కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
రవీంద్ర జడేజా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోపానికి గురైయ్యాడు. ఈ మ్యాచ్ లో 5 బంతులు ఎదుర్కొన్న జడ్డూ 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే అతడు తక్కువ పరుగులు చేసినందుకు కాదు.. రోహిత్, కోహ్లీ తిట్టింది. అతడు ఔటైన తీరుతో వీరిద్దరు అసహనానికి గురైయ్యారు. అసలేం జరిగిందంటే? ఆఫ్గాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారుఖీ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్లో నాలుగో బంతిని స్లోయర్ బౌన్సర్ గా సంధించాడు ఫారుఖీ. అయితే ఆ బాల్ ను వెంటాడి మరీ భారీ షాట్ ఆడాడు. టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో.. షార్ట్ థర్డ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ క్యాచ్ అందుకున్నాడు.
దాంతో అనవసరంగా చెత్త షాట్ ఆడి కీలక సమయంలో జడ్డూ అవుట్ కావడంతో.. డ్రెస్సింగ్ రూమ్ నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. చెత్త షాట్ ఆడి.. చెత్తగా ఔట్ అయ్యావంటూ తిట్టారు. అసలు ఆ బాల్ విడిచిపెడితే.. వైడ్ గా వెళ్లేది. ప్రస్తుతం జడేజాపై విరాట్, రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ 134 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా మూడు వికెట్లు తీశారు.
Same Virat Same 😭
Jadeja what was the need to hit#IndvsAfg pic.twitter.com/xLyGC74INE— 🇸𝖓𝖊𝖍𝖆 (@whom7224) June 20, 2024