Nidhan
ఆ రూల్ వేస్ట్ అంటూ టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాంటి వాటితో టాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ సీరియస్ అయ్యాడు.
ఆ రూల్ వేస్ట్ అంటూ టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాంటి వాటితో టాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ సీరియస్ అయ్యాడు.
Nidhan
టీమిండియా కొత్త కోచ్ రేసులో లెజెండ్ గౌతం గంభీర్ పేరు జోరుగా వినిపిస్తోంది. రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి విదేశీ ప్లేయర్ల పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గంభీర్‌ను బీసీసీఐ సెక్రెటరీ జైషా కలవడం, అనంతరం ఓ ఇంటర్వ్యూలో కోచ్‌గా రావడం తనకు ఇష్టమేనని గౌతీ చెప్పడంతో అతడి పేరు అందరి కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తే గానీ ఏదీ చెప్పలేం. ఈ తరుణంలో భారత జట్టు ఎంపిక గురించి గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా సెలెక్షన్‌కు సంబంధించి ఆ రూల్ దండగ అంటూ సీరియస్ అయ్యాడు. దాని వల్ల టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని అన్నాడు. తీసిపారేస్తే బెటర్ అని సూచించాడు.
భారత జట్టు సెలెక్షన్ సమయంలో ఆటగాళ్లకు యోయో టెస్ట్‌ను నిర్వహిస్తారనేది తెలిసిందే. ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు ఈ పరీక్షను కొలమానంగా భావిస్తారు. ఇందులో పాసైన క్రికెటర్లను టీమిండియాలోకి తీసుకుంటారు. అయితే దీనిపై గతంలో పలు విమర్శలు వచ్చాయి. క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ కంటే ప్రతిభను కొలమానంగా తీసుకోవాలనే వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా కోచ్ రేసులో ఉన్న గంభీర్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేశాడు. యోయో టెస్ట్ దండగ అన్నాడు గౌతీ. దీని వల్ల టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని సీరియస్ అయ్యాడు. ప్రతిభ కంటే ఫిట్నెస్ ముఖ్యమేమీ కాదన్నాడు. యోయో టెస్ట్ అక్కర్లేదని చెప్పడానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మే బెస్ట్ ఎగ్జాంపుల్ అని గంభీర్ పేర్కొన్నాడు.
‘యోయో టెస్ట్‌ను సాకుగా చూపించి ప్రతిభ కలిగిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. ఏ ప్లేయర్‌ను అయినా వాళ్ల టాలెంట్‌ను బట్టే సెలెక్ట్ చేయాలి. వాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్ ఆధారంగా ఛాన్స్ ఇవ్వాలి. యోయో టెస్ట్ అక్కర్లేదని చెప్పడానికి రోహిత్ శర్మ మంచి ఉదాహరణ. ఫిట్నెస్ ముఖ్యమే. కానీ ఫిట్‌గా ఉన్నామా లేదా అని చెప్పడానికి ఫిట్నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అవ్వాలనే రూల్ అనవసరం. ఎందుకంటే కొందరు ప్లేయర్లు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్లలో ఎండ్యూరెన్స్ ఉంటుంది. కానీ వాళ్లు జిమ్‌లో బరువులు ఎత్తలేరు. అంతమాత్రాన ఫిట్‌గా లేరంటే ఎలా? ఆటగాళ్ల ఫిట్నెస్ను తేల్చాల్సింది ట్రెయినర్లు మాత్రమే.. యోయో టెస్ట్ కాదు’ అని గంభీర్ స్పష్టం చేశాడు. ప్లేయర్ల బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్‌ను బట్టి టీమ్‌లోకి తీసుకోవాలని.. ఇలాంటి టెస్టులను తీసిపారేయాలని పేర్కొన్నాడు. మరి.. యోయో టెస్ట్ వేస్ట్ అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Gautam Gambhir “If you don’t select someone just because of the yo-yo test,I don’t think that’s the right way,You select players on their talent,on their batting & bowling skills”
Rohit Sharma is the perfect example who justified Oyo test is not requiredpic.twitter.com/c8lPY5FWr9
— Sujeet Suman (@sujeetsuman1991) June 14, 2024