Nidhan
క్రికెట్ ప్రేమికులకు ఓ శుభవార్త. టీ20 వరల్డ్ కప్‌ను ఉచితంగా చూసే అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ ప్రేమికులకు ఓ శుభవార్త. టీ20 వరల్డ్ కప్‌ను ఉచితంగా చూసే అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Nidhan
గతేడాది వన్డే వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌తో ఆ టోర్నమెంట్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోబెట్టింది. వన్డేల పనైపోయిందని అంతా అనుకుంటున్న టైమ్‌లో ప్రపంచ కప్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఆ టోర్నీ ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టి అప్పుడే రెండు నెలలు పూర్తయింది. వరుసగా టోర్నమెంట్లు, ఐపీఎల్ కూడా ఉండటంతో ఈ ఏడాది ఫ్యాన్స్‌కు పండగే పండగ. అయితే టీ20 ప్రపంచ కప్-2024లో రూపంలో ఇంకోసారి ఆడియెన్స్‌ను వినోదాన్ని పంచేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. జూన్ నెల మొత్తం మెగా టోర్నీ సందడే ఉండనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్. పొట్టి కప్ మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయొచ్చు.
క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ హాట్‌స్టార్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్ని మొబైల్లో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది హాట్‌స్టార్. మెగా టోర్నీలో మ్యాచుల్ని ఎలాంటి ఫీజు చెల్లించుకుండా ఉచితంగా చూడొచ్చు. ఈ వార్తపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా మ్యాచులు చూసే అవకాశం కల్పించడం మంచి విషయమని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం జియో ఉచితంగా మ్యాచులు ఇస్తోంది కాబట్టి దాని బాటలోనే హాట్‌స్టార్ నడుస్తోందని అంటున్నారు. కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయక తప్పడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా పొట్టి ప్రపంచ కప్‌ను ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెగా టోర్నీలో ఏకంగా 20 దేశాలు పాల్గొంటున్నాయి. 20 టీమ్స్‌ను కలిపి నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. రోహిత్ సేన తమ లీగ్ మ్యాచులన్నీ అమెరికాలో ఆడనుంది. టీమిండియా మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-ఏలో ఇండియాతో పాటు దాయాది పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ కూడా ఉన్నాయి. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ స్థానికంగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 9న పాక్‌తో, జూన్ 12న ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. మరి.. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుండటంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ఆ కోచ్ చేసింది తప్పు! యువ క్రికెటర్‌కు దినేష్ కార్తీక్ మద్దతు
🚨 FREE…. FREE…. FREE…!!! 🚨
Hotstar to stream 2024 ICC T20 World Cup for free on mobile app. pic.twitter.com/zQz2dmH9E0
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024