iDreamPost

ENG vs WI: వెస్టిండీస్ ను ఓడించిన పొలార్డ్.. ఇది స్వయంకృతాపరాధమేనా?

సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఓటమికి ఆ దేశ ఆటగాడే కారణం. అతడెవరో కాదు.. కీరన్ పొలార్డ్. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఓటమికి ఆ దేశ ఆటగాడే కారణం. అతడెవరో కాదు.. కీరన్ పొలార్డ్. ఆ వివరాల్లోకి వెళితే..

ENG vs WI: వెస్టిండీస్ ను ఓడించిన పొలార్డ్.. ఇది స్వయంకృతాపరాధమేనా?

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ కు ఊహించని షాకిచ్చింది ఇంగ్లండ్. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లండ్. అయితే ఈ పోరులో వెస్టిండీస్ ఓటమికి ఆ దేశ ఆటగాడే కారణం. అతడెవరో కాదు.. కీరన్ పొలార్డ్. అదేంటి.. విండీస్ ఓటమికి కారణం 87 పరుగులతో చితక్కొటిన ఫిలిప్ సాల్ట్ కాదా? అన్న సందేహం మీకు రావొచ్చు. కానీ ఒక విధంగా చూస్తే.. కరేబియన్ చిత్తు కావడానికి రీజన్ పొలార్డే. ఎలా అంటారా? పదండి తెలుసుకుందాం.

సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ భారీ స్కోర్ ను ఇంగ్లండ్ బ్యాటర్లు 17.3 ఓవర్లలోనే ఊదేశారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు అద్బుత విజయాన్ని అందించాడు. ఇక అతడికి తోడు జానీ బెయిర్ స్టో 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48* పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ ఓటమికి కారణం ఆ దేశ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డే.

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ప్రారంభానికి ముందు.. పొలార్డ్ ను ఇంగ్లండ్ తమ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకుంది. అప్పటి నుంచి ఇంగ్లండ్ టీమ్ తో ట్రావెల్ అవుతున్న పొలార్డ్.. ఈ మ్యాచ్ లో తన అనుభవాన్ని అంతా చూపించాడు. పైగా తన సహచర ఆటగాళ్లు ఎలా బ్యాటింగ్ చేస్తారు? బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు? వారి బలాలు, బహీనతలు అన్నీ తెలిసిన పొలార్డ్.. ఇంగ్లండ్ ప్లేయర్లకు ఎలా ఆడాలో సూచనలు ఇచ్చాడు. దాంతో అతడు చెప్పిన విధంగానే బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ ప్లేయర్లు విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు.

మరీ ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్-జానీ బెయిర్ స్టో తమదైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. ఏ బౌలర్ ను ఎలా ఎదుర్కొవాలో టెక్నిక్ లు చెప్పి.. విండీస్ ఓటమికి కారణమైయ్యాడు కీరన్ పొలార్డ్. అయితే ఇది విండీస్ బోర్డ్ చేసుకున్న స్వయంకృతాపరాధమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పొలార్డ్ ను విండీస్ తమ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకుంటే బాగుండేదని, బౌలింగ్ లో కూడా అతడు సలహాలు ఇచ్చేవాడని వారు చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి