iDreamPost
android-app
ios-app

Philip Salt: విండీస్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్ సాల్ట్.. ఇది ఓ రేంజ్  విధ్వంసం!

  • Published Jun 20, 2024 | 9:56 AM Updated Updated Jun 20, 2024 | 9:56 AM

వెస్టిండీస్ తో సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్ రోమారియో షెఫర్డ్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు.

వెస్టిండీస్ తో సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్ రోమారియో షెఫర్డ్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు.

Philip Salt: విండీస్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్ సాల్ట్.. ఇది ఓ రేంజ్  విధ్వంసం!

టీ20 వరల్డ్ కప్ లో బ్యాటర్లు గేర్లు మారుస్తున్నారు. లీగ్ దశలో లో స్కోర్లు సాధించి.. ప్రేక్షకులకు బోర్ తెప్పించారు. కానీ సూపర్ 8 దశకు వచ్చేసరికి బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నారు ఆటగాళ్లు. తాజాగా సూపర్ 8లో భాగంగా విండీస్-ఇంగ్లండ్ మధ్య సెయింట్ లూసియా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ విధించిన 181 పరుగుల టార్గెట్ ను 17.3 ఓవర్లలోనే దంచికొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్లను చితక్కొట్టాడు ఇంగ్లీష్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్. సిక్సులు, ఫోర్లతో పెను విధ్వంసం సృష్టించాడు.

టీ20 వరల్డ్ కప్ లో బ్యాటర్ల జోరు మెుదలైంది. మెున్నటి వరకు బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ టోర్నీలో.. ఇప్పుడు బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. నిన్న సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ రెచ్చిపోతే.. ఇవ్వాల ఇంగ్లండ్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో చార్లెస్(38), పూరన్(36), పావెల్(36) పరుగులతో రాణించారు. అనంతరం 181 పరుగుల భారీ టార్గెట్ తో దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం అందించారు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్-జోస్ బట్లర్. తొలి వికెట్ కు 67 రన్స్ జోడించారు. బట్లర్(25) పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మెుయిన్ అలీ(13) కూడా తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యాడు.

అనంతరం క్రీజ్ లోకి వచ్చిన జానీ బెయిర్ స్టో.. విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకదశలో సాల్ట్ కంటే ముందే ఫిఫ్టీ కొడతాడని అందరూ అనుకున్నారు. బెయిర్ స్టో 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు సాల్ట్ 49 పరుగులతో ఉన్నాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ లో గేర్ మార్చిన సాల్ట్.. రోమారియో షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 రన్స్ పిండుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 5 సిక్సులతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు జానీ బెయిర్ స్టో 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 48 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఒక దశలో తొలి 37 బంతుల్లో 49 పరుగులు చేసిన సాల్ట్.. ఆ తర్వాత 10 బంతుల్లో ఏకంగా 38 పరుగులు పిండుకున్నాడు. ఈ అంకెలు చూస్తేనే తెలుస్తోంది.. అతడు ఏ రేంజ్ లో దంచికొట్టాడో. వీరిద్దరి ధాటికి ఇంగ్లండ్ 181 పరుగుల టార్గెట్ ను 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.