ENG vs SA మ్యాచ్.. షాకింగ్ రనౌట్ కు బిత్తరపోయిన మిల్లర్! వీడియో వైరల్..

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ENG vs SA మ్యాచ్ లో ఓ షాకింగ్ రనౌట్ నమోదు అయ్యింది. ఇది చూసిన డేవిడ్ మిల్లర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ENG vs SA మ్యాచ్ లో ఓ షాకింగ్ రనౌట్ నమోదు అయ్యింది. ఇది చూసిన డేవిడ్ మిల్లర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా టీమ్ అదరగొడుతోంది. వరుగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. సెమీస్ రేస్ లో దూసుకెళ్తోంది. తాజాగా సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది సఫారీ టీమ్. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ కమ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ తన విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. డికాక్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడమే కాక.. విధ్వంసకర ప్లేయర్ క్లాసెన్ ను రనౌట్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. ఈ ఊహించని రనౌట్ ను చూసిన డేవిడ్ మిల్లర్ బ్యాట్ కిందపడేసి మరీ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ తన కీపింగ్ విన్యాసాలతో అదరగొట్టాడు. తొలుత డికాక్ ను మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపిన బట్లర్.. ఆ తర్వాత క్రేజీ రనౌట్ తో విధ్వంసకర ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేశాడు. ఇది ఊహించని డేవిడ్ మిల్లర్ బిత్తరపోయాడు. అసలేం జరిగిందంటే? సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేయడానికి వచ్చాడు మార్క్ వుడ్. ఈ ఓవర్లో నాలుగో బంతిని లెగ్ సైడ్ బౌన్సర్ గా సంధించాడు. అది కాస్త వైడ్ గా వెళ్లడంతో  బట్లర్ బాల్ ను మిస్ చేశాడు. దాంతో నాన్ స్ట్రైకర్ లో ఉన్న మిల్లర్ రన్ కోసం వచ్చాడు. క్లాసెన్ సైతం బాల్ మిస్ కావడంతో.. పరుగుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే బంతిని అందుకున్న బట్లర్ అద్భుతమైన త్రోతో క్లాసెన్ ను రనౌట్ చేశాడు. ఇది ఊహించని మిల్లర్ బ్యాట్ ను గ్రౌండ్ లోనే కిందపడేసి.. బిత్తరపోయాడు. 13 బంతుల్లో 8 పరుగులు చేసిన క్లాసెన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ రనౌట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డికాక్(65), మిల్లర్(43) పరుగులతో రాణించారు. అనంతరం 164 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 156 రన్స్ కే పరిమితమై.. 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. హ్యారీ బ్రూక్(53) అర్ధసెంచరీతో రాణించాడు. మరి ఈ క్రేజీ రనౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments