Somesekhar
సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో విండీస్ కీపర్ నికోలస్ పూరన్ బౌలర్ అకేల్ హోసెన్ కు ఓ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఆ సిగ్నల్ అర్దం ఏంటని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో విండీస్ కీపర్ నికోలస్ పూరన్ బౌలర్ అకేల్ హోసెన్ కు ఓ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఆ సిగ్నల్ అర్దం ఏంటని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ వర్సెస్ విండీస్ మధ్య జరుగుతున్న ఈ సూపర్ 8 పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చార్లెస్(38), పూరన్(36), కెప్టెన్ రోమన్ పావెల్ 17 బంతుల్లో 5 సిక్సులతో 36 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో విండీస్ కీపర్ నికోలస్ పూరన్ బౌలర్ అకేల్ హోసెన్ కు ఓ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఆ సిగ్నల్ అర్దం ఏంటని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వికెట్ కీపర్లు బ్యాటర్లను బోల్తా కొట్టించడానికి బౌలర్లకు కొన్ని సంకేతాలు ఇస్తుంటారు. దాంతో కన్ఫ్యూజన్ లో బ్యాటర్లు వికెట్ సమర్పించుకున్న సందర్భాలు క్రికెట్ లో కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 4 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(87*), జానీ బెయిర్ స్టో(48*) పరుగులతో రాణించారు.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విండీస్ బౌలర్ అకేల్ హోసెన్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో జోస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కీపర్ నికోలస్ పూరన్ బౌలర్ కు ఓ సిగ్నల్ ఇచ్చాడు. రెండు గ్లౌవ్స్ ను సమానంగా ఉంచకుండా.. ఒక గ్లౌవ్ ను పైకెత్తి.. ఇంకోదాన్ని కిందికి దించాడు. ఈ సిగ్నల్ ను బౌలర్ కు ఇచ్చాడు. దాన్ని అందుకున్న హోసెన్ అతడు చెప్పినట్లుగానే బంతిని వేశాడు. దీంతో పూరన్ అలా గ్లౌవ్స్ ఎందుకు పెట్టాడు? దానికి అర్దం ఏంటి? అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. కాగా.. బ్యాటర్ ను కన్ఫ్యూజ్ చేయడానికే ఇలా సిగ్నల్ ఇచ్చాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది వారి ప్లానింగ్ లో భాగమే అని రాసుకొస్తున్నారు. బాల్ ను తక్కువ ఎత్తులో వేయాల్సిందిగా అతడు సిగ్నల్ ఇచ్చాడని ఇంకొందరు అంటున్నారు. మరి నికోలస్ పూరన్ ఇచ్చిన సిగ్నల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Decode what Nicholas Pooran is trying to convey 👀
📸: Disney+Hotstar pic.twitter.com/6wl01phudh
— CricTracker (@Cricketracker) June 20, 2024