iDreamPost

ఆ భారత క్రికెటర్ చరిత్రలో నిలిచిపోతాడు.. అలాంటోడ్ని చూడలేదు: లారా

  • Published Jun 22, 2024 | 7:32 PMUpdated Jun 22, 2024 | 7:32 PM

టీ20 వరల్డ్ కప్​లో అదరగొడుతున్న టీమిండియాపై ప్రశంసల జల్లులు కురిపించాడు విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా. ఈ సందర్భంగా ఓ భారత ప్లేయర్​ను ప్రత్యేకంగా ప్రశంసించాడు.

టీ20 వరల్డ్ కప్​లో అదరగొడుతున్న టీమిండియాపై ప్రశంసల జల్లులు కురిపించాడు విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా. ఈ సందర్భంగా ఓ భారత ప్లేయర్​ను ప్రత్యేకంగా ప్రశంసించాడు.

  • Published Jun 22, 2024 | 7:32 PMUpdated Jun 22, 2024 | 7:32 PM
ఆ భారత క్రికెటర్ చరిత్రలో నిలిచిపోతాడు.. అలాంటోడ్ని చూడలేదు: లారా

టీ20 వరల్డ్ కప్​-2024లో అదరగొడుతోంది టీమిండియా. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తోంది. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ కప్ సొంతం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విక్టరీస్​తో దుమ్మురేపిన రోహిత్ సేన.. సూపర్-8 రేసును కూడా అంతే పాజిటివ్​గా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి సూపర్ ఫైట్​లో 47 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ బంగ్లాదేశ్​తో అమీతుమీ తేల్చుకోనుంది మెన్ ఇన్ బ్లూ. ఈ మ్యాచ్​లో నెగ్గితే సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. ఒకవేళ ఓడితే నెక్స్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా మీద తప్పక గెలవాల్సి ఉంటుంది. అందుకే బంగ్లా కథ ముగించి.. సెమీస్ బరిలో నిలవాలని పట్టుదలతో ఉంది భారత్.

భారత జట్టు అన్ని విషయాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ నుంచి బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. గత మ్యాచ్​తో బ్యాటర్లు కూడా రిథమ్​ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్​లో భారత్ ఆడుతున్న తీరు చాలా బాగుందంటూ అతడు మెచ్చుకున్నాడు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పెర్ఫార్మెన్స్​ను ప్రత్యేకంగా అభినందించాడు లారా. బుమ్రా లాంటోడ్ని ఇప్పటిదాకా చూడలేదని.. అతడు ఫెంటాస్టిక్ క్రికెటర్ అని మెచ్చుకున్నాడు. బుమ్రా చరిత్రలో నిలిచిపోతాడని తెలిపాడు. అలాంటోడితో పెట్టుకోవడం ఏ టీమ్​కు కూడా మంచిది కాదని హెచ్చరించాడు. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అని.. ప్రస్తుత క్రికెట్​లో అతడే అందరి కంటే బెస్ట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు లారా.

బుమ్రా ఓ వరల్డ్ క్లాస్ బౌలర్. అలాంటోళ్లు ప్రస్తుత క్రికెట్​లో చాలా అరుదు. ఒకవేళ వెస్టిండీస్​లో ఉండాలని అనుకుంటే బుమ్రా ఉండిపోవచ్చు. అతడికి మేం పాస్​పోర్ట్ కూడా ఇస్తాం. ఇక మీదట అతడు మా జట్టు తరఫున ఆడొచ్చు’ అని భారత స్టార్​కు లారా ఆఫర్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ లేదా ఇతర జట్లు ఏవైనా సరే.. భారత్​తో మ్యాచ్ ఉంటే బుమ్రా బౌలింగ్​లో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించకపోవడమే మంచిదన్నాడు. ఇతర బౌలర్ల బౌలింగ్​లో రన్స్ చేసేందుకు చూడాలని.. బుమ్రాను డిఫెండ్ చేస్తే బెటర్ అని సూచించాడు. అలా కాదని.. అతడ్నే టార్గెట్ చేసుకొని పరుగులు చేస్తామంటే మాత్రం ఎవరూ కాపాడలేరని వార్నింగ్ ఇచ్చాడు. బుమ్రాతో పెట్టుకుంటే ఎంతటి బ్యాటర్ అయినా భస్మం అవ్వాల్సిందేనన్నాడు. మెక్​గ్రాత్, ఆంబ్రోస్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజాల సరసన నిలిచే సత్తా బుమ్రాకు ఉందని.. అలాంటోడితో పెట్టుకోవద్దంటూ అపోజిషన్ టీమ్స్​కు హెచ్చరికలు పంపించాడు. మరి.. బుమ్రా చరిత్రలో నిలిచిపోతాడంటూ లారా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి