iDreamPost
android-app
ios-app

Babar Azam: హిస్టరీ క్రియేట్ చేసిన బాబర్.. విరాట్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు!

  • Published Jun 07, 2024 | 4:08 PM Updated Updated Jun 07, 2024 | 4:08 PM

ఎన్ని విమర్శలు ఎదురౌతున్నప్పటికీ.. తాను బద్దలు కొడుతున్న రికార్డులను మాత్రం ఆపడం లేదు బాబర్. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్ని విమర్శలు ఎదురౌతున్నప్పటికీ.. తాను బద్దలు కొడుతున్న రికార్డులను మాత్రం ఆపడం లేదు బాబర్. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Babar Azam: హిస్టరీ క్రియేట్ చేసిన బాబర్.. విరాట్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు!

టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. క్రికెట్ లో పసికూన అయిన అమెరికా చేతిలో ఓడిపోయి.. విమర్శల పాలవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ స్లో బ్యాటింగ్ కారణంగానే జట్టు ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కనపెడితే.. విమర్శలు ఎదురౌతున్నప్పటికీ.. తాను బద్దలు కొడుతున్న రికార్డులను మాత్రం ఆపడం లేదు బాబర్. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలుకొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తొలి మ్యాచ్ లోనే పరువుపోగొట్టుకుంది. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో ఘోర పరాభవం చవిచూసింది పాక్. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోయినప్పటికీ.. కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో బాబర్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు బాబర్.

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 44 రన్స్ చేసిన బాబర్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. 120 టీ20ల్లో 41 సగటుతో 4067 పరుగులు చేశాడు బాబర్. ఇక ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ 118 ఇన్నింగ్స్ ల్లో 51 సగటుతో 4038 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 4026 రన్స్ తో కొనసాగుతున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాడు బాబర్. ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ.. తన పనిని తాను చేసుకుంటూ పోతుంటాడు ఈ పాక్ కెప్టెన్. మరి అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.