iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన బాబర్ అజామ్.. ధోని ఆల్ టైమ్ రికార్డు బద్దలు!

  • Published Jun 17, 2024 | 11:33 AM Updated Updated Jun 17, 2024 | 11:33 AM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

చరిత్ర సృష్టించిన బాబర్ అజామ్.. ధోని ఆల్ టైమ్ రికార్డు బద్దలు!

టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణ ప్రదర్శన కనబర్చిన పాకిస్తాన్.. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడి.. 2 విజయాలు మాత్రమే సాధించి ఇంటిదారి పట్టింది. అమెరికా చేతిలో ఓడిపోవడం పాక్ కు తీవ్ర నష్టం కలిగించింది. ఇక చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 3 వికెట్ల తేడాతో ఊరట విజయం దక్కింది. 107 పరుగుల స్వల్ప నష్టాన్ని చమటోడ్చి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ధోని ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు ఓదార్పు విజయం దక్కింది. ఐర్లాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద నెగ్గింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. డెలానీ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, ఇమద్ వసీమ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 107 రన్స్ స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 18.5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను అతికష్టంగా ఛేదించింది.

కాగా.. ఈ మ్యాచ్ లో 32 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి కెప్టెన్ బాబర్ అజామ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే అతడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా బాబర్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత ఇంతకు ముందు ధోని పేరిట ఉండేది. అతడు 29 ఇన్నింగ్స్ లలో 529 పరుగులు చేశాడు. ఇక బాబర్ కెప్టెన్ గా 17 ఇన్నింగ్స్ లలో 549 పరుగులు చేశాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 527 పరుగులతో ఉన్నాడు. అయితే ధోని ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసినా గానీ.. బాబర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం. బాబర్ చేతగానీ కెప్టెన్సీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పాక్ మాజీ దిగ్గజాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.