iDreamPost
android-app
ios-app

Axar Patel: ఐర్లాండ్ తో మ్యాచ్.. అక్షర్ పటేల్ క్యాచ్ కు కళ్లు తేలేసిన బ్యాటర్!

  • Published Jun 05, 2024 | 9:58 PM Updated Updated Jun 05, 2024 | 9:58 PM

టీమిండియా పేస్ బౌలింగ్ దళం ముందు పసికూన ఐర్లాండ్ విలవిలలాడిపోయింది. దాంతో ప్రత్యర్థి వికెట్లు టపటపా కూలాయి. ఇక ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

టీమిండియా పేస్ బౌలింగ్ దళం ముందు పసికూన ఐర్లాండ్ విలవిలలాడిపోయింది. దాంతో ప్రత్యర్థి వికెట్లు టపటపా కూలాయి. ఇక ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

Axar Patel: ఐర్లాండ్ తో మ్యాచ్.. అక్షర్ పటేల్ క్యాచ్ కు కళ్లు తేలేసిన బ్యాటర్!

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దాంతో ఐరిష్ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలుత అర్షదీప్ సింగ్ భారత్ కు డబుల్ బ్రేక్ త్రూ అందిస్తే.. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేశాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. దాంతో ప్రత్యర్థి వికెట్లు టపటపా కూలాయి. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన క్యాచ్ తో మెరిశాడు.

టీమిండియా పేస్ బౌలింగ్ దళం ముందు పసికూన ఐర్లాండ్ విలవిలలాడిపోయింది. నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత పేసర్లు దుమ్మురేపారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లకు క్రీజ్ లో నిలదొక్కుకోకుండా వచ్చిన ప్లేయర్లను వచ్చినట్లుగానే పెవిలియన్ కు చేర్చారు. దాంతో 16 ఓవర్లకు 96 పరుగులకే కుప్పకూలింది ఐరిష్ టీమ్. జట్టులో గారెత్ డెలానీ ఒక్కడే 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పాండ్యా 3, అర్షదీప్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ తలా ఓ వికెట్ తీశారు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేయడానికి వచ్చిన అక్షర్.. వేసిన రెండో బంతిని అంచనా వేయడంలో విఫలం అయిన మెకర్తీ.. లెగ్ సైడ్ ఆడబోయాడు. కానీ బాల్ ఎడ్జ్ తీసుకుని నాన్ స్ట్రైకర్ కు కాస్త దూరంగా వెళ్తోంది. ఈ క్రమంలోనే కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో డైవ్ చేస్తూ.. కష్టసాధ్యమైన క్యాచ్ ను అక్షర్ ఒడిసిపట్టుకున్న తీరు అమోఘం. ఆ క్యాచ్ అక్షర్ పట్టుకుంటాడని అస్సలు ఊహించలేదు ఐరిష్ బ్యాటర్. డకౌట్ గా నిరాశగా పెవిలియన్ చేరాడు మెకర్తీ. ఇక ఈ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు అక్షర్. మరి మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.