iDreamPost

Pat Cummins: మ్యాచ్ ఓడినా.. చరిత్ర సృష్టించిన కమ్మిన్స్! ప్రపంచంలో ఒకే ఒక్కడు..

సూపర్ 8లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 21 రన్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ 8లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 21 రన్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Pat Cummins: మ్యాచ్ ఓడినా.. చరిత్ర సృష్టించిన కమ్మిన్స్! ప్రపంచంలో ఒకే ఒక్కడు..

టీ20 వరల్డ్ కప్ లో సంచలన విజయాలే కాదు.. సంచలన రికార్డులు కూడా నమోదు అవుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే వరల్డ్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. మెున్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించి.. ఈ వరల్డ్ కప్ లో ఆ ఘనత దక్కించుకున్న తొలి బౌలర్ గా కమ్మిన్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ వికెట్లు తీసి.. వరల్డ్ క్రికెట్ నే సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ఆసీస్ స్టార్ బౌలర్.

పొట్టి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ చెలరేగిపోతున్నాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఇతడు.. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా హ్యాట్రిక్ తీసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ లో రెండుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ గా ఘనత వహించాడు కమ్మిన్స్. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. చివరి బంతికి ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత 20వ ఓవర్ వేయడానికి వచ్చి.. తొలి రెండు బంతుల్లో వరుసగా.. కరీం జనత్, గుల్బాదిన్ నైబ్ లను ఔట్ చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు.

Pat Cummins

అయితే ఈ రికార్డ్ తో పాటుగా మరికొన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవ్వరూ సాధించలేదు. ఇక ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన 5వ బౌలర్ గా నిలిచాడు ఈ ఆసీస్ బౌలర్. ఈ జాబితాలో లసిత్ మలింగ(శ్రీలంక), టీమ్ సౌథీ(న్యూజిలాండ్), మార్క్ పావ్లో విక్(సెర్బియా), వసీం అబ్బాస్(మాల్టా) ప్యాట్ కమ్మిన్స్ కంటే ముందున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి