BAN vs AFG: వీడియో: బంగ్లా పై సంచలన విజయం.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ క్రికెటర్

బంగ్లాపై సంచలన విజయం సాధించడంతో.. గ్రౌండ్ లోనే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు ఓ స్టార్ క్రికెటర్. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బంగ్లాపై సంచలన విజయం సాధించడంతో.. గ్రౌండ్ లోనే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు ఓ స్టార్ క్రికెటర్. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీ20 ప్రపంచ కప్ లో ఆఫ్గానిస్తాన్ సంచలన ప్రదర్శనతో దూసుకెళ్లోంది. బంగ్లాదేశ్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక ఆఫ్గాన్ విజయంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఇక బంగ్లాపై సంచలన విజయం సాధించడంతో.. గ్రౌండ్ లోనే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు ఓ స్టార్ క్రికెటర్. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్గానిస్తాన్ సెమీస్ కు దూసుకెళ్లింది. కింగ్స్ స్టన్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 రన్స్ తేడాతో ఆఫ్గాన్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. జట్టులో రహ్మనుల్లా గుర్బాజ్ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో రషీద్ హోస్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే బంగ్లా బ్యాటింగ్ కు దిగే క్రమంలో వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. బంగ్లా టార్గెట్ ను 114 పరుగులుగా నిర్ణయించారు.

కాగా.. 12.1 ఓవర్లలో టార్గెట్ ను ఛేదిస్తే, ఆఫ్గాన్, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ కు వెళ్లేదే. కానీ అలా జరగలేదు. ఆఫ్గాన్ యోధుల ముందు బంగ్లా బెబ్బులులు తలొంచాయి. రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెలరేగడంతో.. 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలి.. 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. లిట్టన్ దాస్ 54 పరుగులతో అజేయంగా నిలిచి, ఒంటరి పోరాటం చేసినా.. ఫలితం లేకపోయింది. రషీద్, నవీన్ తలా 4 వికెట్లతో బంగ్లా ఓటమిని శాసించారు.

ఇక ఈ చారిత్రక విజయంతో ఆఫ్గాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రహ్మనుల్లా గుర్బాజ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. గాయం కారణంగా ఫీల్డింగ్ చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న గుర్బాజ్.. ఆఫ్గాన్ గెలవడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు చేరడంతో.. తన సంతోషాన్ని ఇలా పంచుకున్నాడు.

Show comments