iDreamPost

SA vs AFG: సెమీస్ కు ఆఫ్గానిస్తాన్.. వరల్డ్ కప్ పై ఆశలు వదిలేసుకున్న సౌతాఫ్రికా!

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి ఆఫ్గానిస్తాన్ దూసుకురావడంతో.. సౌతాఫ్రికా శిబిరంలో టెన్షన్ మెుదలైంది. మరి ఆందోళనకు గల కారణాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి ఆఫ్గానిస్తాన్ దూసుకురావడంతో.. సౌతాఫ్రికా శిబిరంలో టెన్షన్ మెుదలైంది. మరి ఆందోళనకు గల కారణాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

SA vs AFG: సెమీస్ కు ఆఫ్గానిస్తాన్.. వరల్డ్ కప్ పై ఆశలు వదిలేసుకున్న సౌతాఫ్రికా!

టీ20 వరల్డ్ కప్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సెమీస్ కు దూసుకొచ్చింది సంచలన జట్టు ఆఫ్గానిస్తాన్. లీగ్ దశలో న్యూజిలాండ్ ను మట్టికరిపించిన ఆ టీమ్.. సూపర్ 8లో ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చింది. దాంతో సెమీస్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది కంగారూ జట్టు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుతంగా రాణించి.. 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆఫ్గాన్ జూన్ 27న సౌతాఫ్రికాను ఢీకొనబోతోంది. అయితే దక్షిణాఫ్రికా కంటే ఆఫ్గాన్ చిన్న జట్టే అయినా.. ప్రోటీస్ టీమ్ కు వణుకు స్టార్ట్ అయ్యింది. తన కంటే తక్కువ టీమ్ ను చూసి సఫారీ జట్టు ఎందుకు భయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 ప్రపంచ కప్ 2024 ముగింపు దశకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ కు వచ్చిన నాలుగు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి. గ్రూప్ 1 నుంచి ఇండియాతో పాటుగా టోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న ఆఫ్గానిస్తాన్ సెమీస్ కు చేరుకున్నాయి. ఇక గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు సెమీస్ కు వచ్చాయి. జూన్ 27న దక్షిణాఫ్రికాతో ఆఫ్గానిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు ఇంగ్లండ్ ను ఢీకొట్టబోతోంది టీమిండియా. ఈ రెండు మ్యాచ్ ల కోసం ప్రేక్షకులతో పాటుగా మాజీ క్రికెటర్లు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సెమీస్ కు ఆఫ్గానిస్తాన్ రావడంతో.. దక్షిణాఫ్రికా వెన్నులో వణుకు ప్రారంభమైంది. దానికి కారణం ఏంటంటే? ప్రస్తుతం ఆఫ్గాన్ చూపిస్తున్న పోరాటమే. ఈ టోర్నీలో ఆ టీమ్ ఆటను చూస్తే.. ఏ జట్టైనా కాస్త వణకాల్సిందే. లీగ్ దశలో పటిష్టమైన న్యూజిలాండ్ లాంటి టీమ్ నే ఓడించిన ఘనత ఆఫ్గాన్ సొంతం. ఇక సూపర్ 8లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకే షాకిచ్చి.. ఏకంగా టోర్నీ నుంచి ఇంటికే పంపించింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా వంతు వచ్చింది. ఈ లీగ్ లో ఆఫ్గాన్ ఓపెనర్లు గర్బాజ్-జద్రాన్ లు అద్భుతంగా రాణిస్తున్నారు. దాదాపు ప్రతీ మ్యాచ్ లో శుభారంభాలు ఇస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖీ లతో పటిష్టంగా ఉంది.

Soth africa

 

కాగా.. సౌతాఫ్రికా విషయానికి వస్తే.. ఈ టోర్నీలో ఓటమి ఎరగని టీమ్ గా కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కూడా విజయం సాధించింది. అలాగే సూపర్ 8లో 3 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఎదురులేకుండా సెమీస్ కు దూసుకెళ్లింది. అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న సఫారీ టీమ్ కు సెమీస్ లో ఆఫ్గాన్ రూపంలో ఓ గండం పొంచి ఉంది. పెద్ద జట్లకు షాకివ్వడాన్ని అలవాటు చేసుకున్న ఆఫ్గాన్.. దాంతోనే ప్రోటీస్ జట్టును మట్టికరిపించాలని భావిస్తోంది. ఇక సెమీస్ అనగానే సౌతాఫ్రికా టీమ్ కు ముచ్చెమటలు పడతాయి. ఆ జట్టు నాకౌట్స్ పెద్ద గండం. ఈ విషయం చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది.

అయితే సెమీస్ లో దురదృష్టం సఫారీ టీమ్ వెన్నంటే ఉంటుంది. వర్షం వచ్చి మ్యాచ్ ఫలితం వారికి వ్యతిరేకంగా రావడమో లేక ఓడిపోవడమో జరుగుతూ ఉంటుంది. పైగా స్పిన్ ఆడటంలో సఫారీ బ్యాటర్లు వీక్. ఇదే వారికి పెద్ద సమస్యగా మారబోతోంది. రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ను ఎదుర్కొవడం సవాల్ తో కూడుకున్న విషయం. ఇదీకాక ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ విషయం తెలియనిది కాదు. ఈ అన్ని అంశాలు కలిసి దక్షిణాఫ్రికా టీమ్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దాంతో కప్ కష్టమేనా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి ఆఫ్గాన్-సౌతాఫ్రికా మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి