iDreamPost

AUS vs AFG: టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం.. ఆసీస్ ను చిత్తు చేసిన ఆఫ్గానిస్తాన్!

టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 21 రన్స్ తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది ఆఫ్గానిస్తాన్. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 21 రన్స్ తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది ఆఫ్గానిస్తాన్. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

AUS vs AFG: టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం.. ఆసీస్ ను చిత్తు చేసిన ఆఫ్గానిస్తాన్!

టీ20 వరల్డ్ కప్ 2024 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. పెద్ద పెద్ద జట్లకు షాకిస్తూ.. పసికూన టీమ్స్ చెలరేగిపోతున్నాయి. తాజాగా పొట్టి వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. సూపర్ 8లో భాగంగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఈ ఊహించని విజయంతో తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆఫ్గానిస్తాన్. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పొట్టి వరల్డ్ కప్ లో పెను సంచలన నమోదు అయ్యింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆసీస్ కు ఊహించని షాకిచ్చింది ఆఫ్గానిస్తాన్. కింగ్ స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 21 రన్స్ తో కంగారుల టీమ్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు గుర్బాజ్(60), జద్రాన్(51) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మరో హ్యాట్రిక్ సాధించాడు.

Afghanisthan

 

అనంతరం 149 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కంగారూ టీమ్.. ఆఫ్గాన్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. జట్టులో మాక్స్ వెల్ ఒక్కడే 59 పరుగులతో రాణించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడికి తోడు నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఓ దశలో మాక్స్ వెల్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఆసీస్ దే విజయం అని అందరూ అనుకున్నారు. కానీ.. నైబ్ మాక్సీని పెవిలియన్ కు పంపి, ఆసీస్ విజయంపై నీళ్లు చల్లాడు.

ఇక ఈ గెలుపుతో తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆఫ్గానిస్తాన్. మరి ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్గాన్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తొలిసారి కంగారూ టీమ్ ను ఓడించి.. చరిత్ర సృష్టించింది ఆఫ్గానిస్తాన్. కాగా.. ఈ టోర్నీలోనే న్యూజిలాండ్ ను కూడా ఆఫ్గాన్ ఓడించిన సంగతి తెలిసిందే. మరి ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి