iDreamPost

వీడియో: ప్లేయర్ పైకి బ్యాట్ విసిరిన రషీద్ ఖాన్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు!

ఎప్పుడూ కూల్ గా కనిపించే రషీద్ ఖాన్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తన సహచర ప్లేయర్ పై ఉగ్రరూపాన్ని చూపించాడు. ఏకంగా అతడిపైకి బ్యాట్ నే విసిరేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఎప్పుడూ కూల్ గా కనిపించే రషీద్ ఖాన్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తన సహచర ప్లేయర్ పై ఉగ్రరూపాన్ని చూపించాడు. ఏకంగా అతడిపైకి బ్యాట్ నే విసిరేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

వీడియో: ప్లేయర్ పైకి బ్యాట్ విసిరిన రషీద్ ఖాన్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు!

బంగ్లాదేశ్ పై సాధించిన అద్భుతమైన విజయంతో ఇండియాతో పాటుగా సెమీస్ కు దూసుకొచ్చింది ఆఫ్గాన్ టీమ్. కింగ్స్ స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది ఆఫ్గాన్. ఇక ఈ మ్యాచ్ లో 115 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక బంగ్లాదేశ్ 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆఫ్గానిస్తాన్. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఎప్పుడూ కూల్ గా కనిపించే రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో తన సహచర ప్లేయర్ పై ఉగ్రరూపాన్ని చూపించాడు. ఏకంగా అతడిపైకి బ్యాట్ నే విసిరేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

రషీద్ ఖాన్.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్ గా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. ఇక ఐపీఎల్ ద్వారా టీమిండియా ప్లేయర్లకు, ఫ్యాన్స్ కు దగ్గరైయ్యాడు. తన ప్రవర్తనతో గుడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ.. ప్రత్యర్థి ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు రషీద్. ఇలాంటి ఆటగాడు బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే?

ఆఫ్గానిస్తాన్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చివరి ఓవర్ వేయడానికి తంజిమ్ హసన్ షకీబ్ రాగా.. క్రీజ్ లో కెప్టెన్ రషీద్ ఖాన్ తో పాటు కరీమ్ జనత్ ఉన్నారు. తొలి బంతికి సింగిల్ తీసి రషీద్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు జనత్. ఇక ఆ తర్వాత బాల్ ను సిక్స్ గా మలిచాడు. మూడో బంతిని హెలికాప్టర్ షాట్ ఆడాడు. కానీ బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. హాఫ్ సైడ్ గాల్లోకి లేచింది. అదృష్టవశాత్తు దాన్ని ఎవ్వరూ క్యాచ్ అందుకోలేదు.

ఈ క్రమంలో ఒక రన్ పూర్తి చేసుకున్న తర్వాత రషీద్ రెండో రన్ కోసం సగం పిచ్ వరకు పరిగెత్తాడు. కానీ కరీం జనత్ నో అంటూ రషీద్ కు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పిచ్ సగం వచ్చిన తర్వాత అతడు రన్ కోసం రాకపోవడంతో.. రషీద్ ఖాన్ కు పట్టరాని కోపం వచ్చింది. బ్యాట్ ను అతడి వైపు విసిరి.. ఆగ్రహంతో తిరిగి క్రీజ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడు బ్యాట్ తెచ్చి ఇవ్వగా.. కోపంగానే తీసుకుని బ్యాట్ ను ప్యాడ్స్ కు వేసి కొట్టుకుంటూ వచ్చాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి.. తన కోపాన్ని చల్లార్చుకున్నాడు ఆఫ్గాన్ కెప్టెన్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. రషీద్ ఖాన్ ను ఇలా ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి