వీడియో: బుల్లెట్‌ బంతులతో దుమ్ములేపిన నటరాజన్‌! వణికిపోయిన బ్యాటర్లు

వీడియో: బుల్లెట్‌ బంతులతో దుమ్ములేపిన నటరాజన్‌! వణికిపోయిన బ్యాటర్లు

T Natarajan, TNPL 2024: టీమిండియా బౌలర్‌ టీ.నటరాజన్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో యువ క్రికెటర్లను వణికించాడు. భయపెట్టే బౌన్సర్లు, వణికించే యార్కర్లతో వికెట్లు పంట పండించాడు. నటరాజన్‌ విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

T Natarajan, TNPL 2024: టీమిండియా బౌలర్‌ టీ.నటరాజన్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో యువ క్రికెటర్లను వణికించాడు. భయపెట్టే బౌన్సర్లు, వణికించే యార్కర్లతో వికెట్లు పంట పండించాడు. నటరాజన్‌ విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా బౌలర్‌ నటరాజన్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్‌తో పాటు టీమిండియాలోనూ తన సూపర్‌ బౌలింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతూ.. నటరాజన్‌ వేసిన యార్కర్లతోనే అతనికి టీమిండియాలో చోటు దక్కింది. కానీ, గాయాల కారణంగా తన ప్లేస్‌ను పర్మినెంట్‌ చేసుకోలేకపోయాడు. తాజాగా తమిళనాడులో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో నటరాజన్‌ తన సత్తా చాటాడు. నిప్పులు చిమ్మే బంతులు వేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు.

ఐడ్రీమ్‌ తిరుప్పూర్ తమిజన్స్ తరఫున ఆడుతున్న నటరాజన్‌ ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి.. 12 వికెట్లు పడగొట్టాడు. అందులో కూడా అదరిపోయే యార్కర్లు, బ్యాటర్లను భయపెట్టే బౌన్సర్లు ఉన్నాయి. మొత్తంగా టీఎన్‌పీఎల్‌ 2024లో నటరాజన్‌ సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టాడు. తను ఆడిన మ్యాచ్‌ల్లో 2, 1, 2, 4, 3 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఇదే ప్రదర్శనను దేశవాళి క్రికెట్‌లో కూడా కొనసాగించి.. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నటరాజన్‌ భావిస్తున్నాడు.

కాగా, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో నటరాజన్‌ టీమ్‌ ఐడ్రీమ్‌ తిరుప్పూర్‌ తమిజన్స్‌ జట్టు ఈ రోజు(శుక్రవారం) దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టుతో క్వాలిఫైయర్‌-2 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే.. ఆ టీమ్‌ టీఎన్‌పీఎల్‌ 2024 ఫైనల్‌కు వెళ్లనుంది. దిండిగల్‌ డ్రాగన్స్‌ టీమ్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలసిందే. మరి క్వాలిఫైయర్‌-2లో టీ.నటరాజన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. అయితే.. రాబోయే దేశవాళి క్రికెట్‌లో నటరాజన్‌ రాణించడంపైనే టీమిండియాలో అతని రీ ఎంట్రీ ఆధారపడింది. లేదంటే.. ఐపీఎల్‌ 2025 వరకు వేచి చూడాల్సిందే.

Show comments