టీమిండియాలో అతడు చాలా స్పెషల్! జట్టు కోసం ఏదైనా చేస్తాడు: టి దిలీప్

T Dileep Praises Yuzvendra Chahal: టీమిండియా సక్సెస్​లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్. ఫీల్డింగ్​లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ సెట్ చేశాడీ హైదరాబాదీ. భారత జట్టు ఫీల్డింగ్​లో ఈ రేంజ్​లో పెర్ఫార్మ్ చేస్తోందంటే దానికి అతడి కృషే కారణం.

T Dileep Praises Yuzvendra Chahal: టీమిండియా సక్సెస్​లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్. ఫీల్డింగ్​లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ సెట్ చేశాడీ హైదరాబాదీ. భారత జట్టు ఫీల్డింగ్​లో ఈ రేంజ్​లో పెర్ఫార్మ్ చేస్తోందంటే దానికి అతడి కృషే కారణం.

క్రికెట్​లో బ్యాటింగ్, బౌలింగ్​లో రాణిస్తే సరిపోదు. ఫీల్డింగ్​లో కూడా బెస్ట్ ఇవ్వాలి. ఫీల్డింగ్ బలం మీద మ్యాచ్​లు గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రతి టీమ్ తమ ఫీల్డింగ్ స్ట్రెంగ్త్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీమిండియా కూడా ఈ దిశగా ట్రై చేసి సక్సెస్ అయింది. గత కొన్నేళ్లలో భారత జట్టు ఫీల్డింగ్​లో హై-స్టాండర్డ్స్​ అందుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్​కు చేరుకోవడంలోనూ టీ20 వరల్డ్ కప్​ను భారత్ అందుకోవడంలోనూ ఫీల్డింగ్ రోల్ ఎంతో ఉంది. ఈ సక్సెస్​లో ఎంతో కీలకంగా వ్యవహరించాడు ఫీల్డింగ్ కోచ్, మన తెలుగోడు టి దిలీప్. భారత జట్టు ఫీల్డింగ్​లో ఈ రేంజ్​లో పెర్ఫార్మ్ చేస్తోందంటే దానికి ఈ హైదరాబాదీ కృషే కారణం. అలాంటోడు తాజాగా టీమిండియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్​కాస్ట్​లో పాల్గొన్న టి దిలీప్ టీ20 వరల్డ్ కప్ విజయంతో పాటు భారత జట్టు ఆటగాళ్ల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. టీమిండియాలో ఓ స్పెషల్ ప్లేయర్ ఉన్నాడని.. అతడే యుజ్వేంద్ర చాహల్ అని అన్నాడు. చాహల్ అందరితో జోవియల్​గా ఉంటాడని, అతడి వ్యక్తిత్వం సూపర్ అని మెచ్చుకున్నాడు. అందరితో ఈజీగా కలసిపోతాడని, ఫన్నీ పర్సన్ అని దిలీప్ తెలిపాడు. చాహల్​ పాజిటివ్ పర్సన్ అని.. మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా అతడిలో పెద్ద తేడా ఉండదన్నాడు. టీమ్​లో చోటు దక్కకపోయినా దాన్ని పాజిటివ్​గా తీసుకుంటాడని పేర్కొన్నాడు. చాహల్ టీమ్ ప్లేయర్ అని ప్రశంసలు కురిపించిన దిలీప్.. జట్టులో లేకపోయినా సరే, ఇతర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తుంటాడని తెలిపాడు. ఆడినా, ఆడకపోయినా అతడిలో డిఫరెన్స్ కనిపించదన్నాడు.

చాహల్ పక్కా టీమ్ ప్లేయర్ అని దిలీప్ అన్నాడు. జట్టులో ఉన్నా, లేకపోయినా అతడి యాటిట్యూడ్​లో ఏమాత్రం తేడా కనిపించదన్నాడు. టీమ్ కోసం ఏదైనా చేస్తాడని.. అలాంటోళ్లు చాలా అరుదంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా దిలీప్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసునని.. కానీ అతడి వ్యక్తిత్వం గురించి ఎక్కువ మందికి తెలియదన్నాడు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవారు చాలా తక్కువ అని మెచ్చుకున్నాడు. ప్రతి ప్లేయర్​తో అతడు మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడన్నాడు. అతడితో తనకు స్పెషల్ బాండింగ్ ఉందన్నాడు దిలీప్. గ్రౌండ్​లో టీమ్​ను అద్భుతంగా నడిపిస్తాడని.. ఈ క్రమంలో ఒక్కోసారి జోక్స్ వేస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పడేలా చేస్తాడని తెలిపాడు. కెప్టెన్సీలో తాను చూసిన వారిలో రోహిత్ బెస్ట్ అని మెచ్చుకున్నాడు.

Show comments