టీమిండియాలో టాప్-3 ఫీల్డర్లు ఎవరు? ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అదిరిపోయే ఆన్సర్!

Virat Kohli, Rohit Sharma, T Dileep, Ravindra Jadeja: భారత జట్టులో చాలా మంది తోపు ఫీల్డర్లు ఉన్నారు. వారిలో టాప్-3 ఎవరంటే మాత్రం బిగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్​ టి దిలీప్​కు ఓ ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ ఎదురైంది. దానికి అతడు ఏమన్నాడంటే..

Virat Kohli, Rohit Sharma, T Dileep, Ravindra Jadeja: భారత జట్టులో చాలా మంది తోపు ఫీల్డర్లు ఉన్నారు. వారిలో టాప్-3 ఎవరంటే మాత్రం బిగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్​ టి దిలీప్​కు ఓ ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ ఎదురైంది. దానికి అతడు ఏమన్నాడంటే..

బ్యాటింగ్, బౌలింగ్​లో బలంగా ఉన్న భారత్​ను ఫీల్డింగ్​లోనూ స్ట్రాంగ్ పవర్​గా మార్చాడతను. బ్యాటర్లే కాదు.. బౌలర్లనూ మెరికల్లా తయారు చేశాడు. ఒక్కరు, ఇద్దరు కాదు.. మొత్తం టీమ్ ఫీల్డింగ్​లో పాదరసంలా కదిలేలా ట్రెయినింగ్ ఇచ్చాడు. క్యాచ్​లు వదలకుండా, రనౌట్స్ మిస్ చేయకుండా చూసుకున్నాడు. ఒక్కో పరుగు ఎంత విలువో చెప్పి.. అద్బుతమైన ఫీల్డింగ్ టీమ్​గా తయారు చేశాడు. అతడే టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్. మన తెలుగు బిడ్డ అయిన దిలీప్ సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 ప్రపంచ కప్ విజయంతో పాటు గత కొన్నేళ్లలో మెన్ ఇన్ బ్లూ సాధించిన సక్సెస్​లో అతడు ఎంతో కీలకంగా ఉన్నాడు. ఫీల్డింగ్ మెడల్స్ ప్రవేశపెట్టి ఆటగాళ్లలో కసిని పెంచాడు. ఇలా జట్టు కోసం ఎంతో చేసిన టి దిలీప్ తాజాగా టీమిండియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

భారత జట్టుకు ఇన్నాళ్లుగా సేవలు అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు దిలీప్. టీ20 ప్రపంచ కప్ విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేశామని.. ఎన్నో ఏళ్ల కష్టానికి ఆ టోర్నమెంట్​తో ఫలితం లభించిందన్నాడు. వన్డే ప్రపంచ కప్​ను సొంతం చేసుకోవడానికి అంతే శ్రమించామని.. అయితే ఫైనల్​లో ఏదీ తమకు కలసిరాలేదన్నాడు. ఓ పాడ్​కాస్ట్​లో మాట్లాడుతూ అతడు ఈ కామెంట్స్ చేశాడు. భారత జట్టులో టాప్-3 ఫీల్డర్లు ఎవరనే ప్రశ్నకు దిలీప్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ముగ్గురు ఆటగాళ్ల పేర్లు చెప్పడం చాలా కష్టమని.. ప్రతి ప్లేయర్ ఫీల్డింగ్​లో అదరగొడుతున్నాడని అన్నాడు. అయితే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ ఫీల్డింగ్​లో చూపే ప్రతిభను మెచ్చుకోవాల్సిందేనన్నాడు. వాళ్లు బ్రిలియంట్ ఫీల్డర్స్ అని ప్రశంసించాడు. హిట్​మ్యాన్ బంతిని ఛేజ్ చేసే తీరు, డైవింగ్ చేసే విధానం సూపర్ అన్నాడు.

రోహిత్, కోహ్లీ, జడేజాతో పాటు హార్దిక్ పాండ్యా కూడా సూపర్ ఫీల్డర్ అని మెచ్చుకున్నాడు దిలీప్. ఆల్​రౌండర్​గా ఉండి ఆ రేంజ్​లో ఫీల్డింగ్​లో ఎఫర్ట్స్ పెట్టడం మామూలు విషయం కాదన్నాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా తోపు ఫీల్డర్లని ప్రశంసించాడు. ఈ మూడేళ్లలో టీమ్ అంతా ఎంతో కష్టపడి ఫీల్డింగ్​లో మంచి స్టాండర్డ్స్ సెట్ చేశామన్నాడు దిలీప్. ప్రస్తుత క్రికెట్​లో తమదే బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్ సూర్య​ గురించి కూడా ఫీల్డింగ్ కోచ్ కామెంట్స్ చేశాడు. సూర్యతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందన్నాడు. కెప్టెన్ అవ్వక ముందు నుంచి మ్యాచ్​లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం, మంచి సజెషన్స్ ఇవ్వడం అతడికి అలవాటు అని తెలిపాడు. అతడిలో సారథ్య లక్షణాలు ఉన్నాయని.. దాన్ని ముందే గుర్తించామన్నాడు దిలీప్. మరి.. కోహ్లీ, జడేజా, రోహిత్ భారత జట్టులో టాప్-3 ఫీల్డర్లు అంటూ ఫీల్డింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments