క్రికెట్లో రికార్డులన్నీ దాదాపుగా పెద్ద జట్ల పేర్ల మీదనే ఉంటాయి. ఎక్కువ కాలం పాటు గేమ్‌లో కొనసాగే స్టార్ ప్లేయర్లు అంతకుముందు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తుంటారు. వాళ్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటారు. ఆల్‌టైమ్ రికార్డులు కూడా దాదాపుగా వాళ్ల పేర్ల మీదనే ఉంటాయి. పసికూన జట్లకు, ఆ టీమ్స్‌లోని ప్లేయర్లకు ఆ ఛాన్స్ పెద్దగా ఉండదనే చెప్పాలి. తక్కువ మ్యాచ్‌లు ఆడటం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే క్వాలిటీ ఆటగాళ్లు లేకపోవడతో వీరి నుంచి ప్రేక్షకులు పెద్దగా ఆశించరు. అయితే కొందరు అనామక ఆటగాళ్లు, పసికూన జట్లలోని క్రికెటర్లు తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తుంటారు.
పెద్ద స్టార్లే కాదు తాము కూడా అద్భుతాలు చేయగలమని కొందరు పసికూన ప్లేయర్లు అప్పుడప్పుడు ప్రూవ్ చేస్తుంటారు. తమ అపురూపమైన ప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఒక ఘటనే చోటుచేసుకుంది. టీ20 క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని మలేషియాకు చెందిన పసికూన బౌలర్ ఇద్రుస్ నిరూపించాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో టాప్ బౌలర్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు ఇద్రుస్.
పొట్టి ఫార్మాట్లో ఇప్పటిదాకా ఒకే మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో నైజీరియా బౌలర్ పీటర్ అహో, భారత బౌలర్ దీపక్ చాహర్ (6 వికెట్లు) ఫస్ట్ ప్లేసులో నిలిచారు. వీళ్ల రికార్డును ఇద్రుస్ తుడిచేశాడు. వరల్డ్‌లో ఇన్ని టీ20 లీగ్‌లు జరుగుతున్నా.. ఏ ఒక్క బౌలర్ కూడా ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు తీయలేదు. మొత్తానికి ఒక్క పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఇద్రుస్. కుడి చేతి వాటం బౌలర్ అయిన అతడు చైనాతో మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇద్రుస్ ధాటికి ప్రత్యర్థి జట్టు 23 రన్స్‌కే కుప్పకూలింది. 24 రన్స్ టార్గెట్‌ను మలేషియా టీమ్ 4.5 ఓవర్లలో ముగించింది.
A seven-wicket haul in a T20I 🤯
Malaysia’s Syazrul Idrus claimed the best bowling figures in T20 history with 4-1-8-7 against China – all seven wickets bowled 🎯
(📹: @ICC) pic.twitter.com/iZ6902tBF1
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2023