iDreamPost
android-app
ios-app

SRHని గెలిపించిన భువనేశ్వర్ మనసులో ఇంత బాధ ఉందా? ఈ తప్పు ఎవరిది?

  • Published May 03, 2024 | 6:09 PM Updated Updated May 03, 2024 | 7:48 PM

Bhuvneshwar: ప్రస్తుతం అంతా భువనేశ్వర్ కుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. కానీ, భువనేశ్వర్ కుమార్ మనసులో ఎంత బాధ ఉందో తెలుసా?

Bhuvneshwar: ప్రస్తుతం అంతా భువనేశ్వర్ కుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. కానీ, భువనేశ్వర్ కుమార్ మనసులో ఎంత బాధ ఉందో తెలుసా?

  • Published May 03, 2024 | 6:09 PMUpdated May 03, 2024 | 7:48 PM
SRHని గెలిపించిన భువనేశ్వర్ మనసులో ఇంత బాధ ఉందా? ఈ తప్పు ఎవరిది?

భువనేశ్వర్ కుమార్ అలియాస్ స్వింగ్ కింగ్. తాజాగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో వింటేజ్ భువనేశ్వర్ ని చూశారు అంతా. మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు సాధించి అద్భుతమైన స్టార్ట్ ని హైదరాబాద్ జట్టుకు అందించాడు. ఆ తర్వతా ఆఖరి ఓవర్లో ఒక్క బంతికి 2 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో వికెట్ తీసి భువనేశ్వర్ కుమార్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇలాంటి అద్భుతాలు భువీ నుంచి మనం కేవలం ఐపీఎల్ లో మాత్రమే చూస్తున్నాం. కానీ, టీమిండియా జెర్సీలో భువనేశ్వర్ ని చూడలేకపోతున్నామే అనే బాధ మాత్రం అందరికీ ఉంది. క్రికెట్ అభిమానులకే ఇలా ఉంటే.. భువనేశ్వర్ కు ఎలా ఉంటుంది? తన గుండెల్లో ఒక అగ్ని పర్వతాన్నే దాచుకున్నాడు.

ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఫీవర్లో ఉన్నారు. ఎక్కడ చూసినా తమ ఫేవరెట్ జట్టు గురించే మాట్లాడుతున్నారు. ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు వాళ్లంతా మా జట్టు అంటూ రొమ్ము విరిచి చెప్తున్నారు. హైదరాబాద్ జట్టు ప్రదర్శన కూడా అంతే అద్భుతంగా ఉంది. ఈ అద్భుత ప్రదర్శనకు భువనేశ్వర్ కుమార్ కూడా ఒక కారణం. తాజాగా అతను మ్యాచ్ గెలిపించిన తీరుకు ప్రత్యర్థులు కూడా ఫిదా అయిపోయారు.

Bhuvi

ఇలాంటి స్వింగ్ కింగ్ టీమిండియాకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో కంబ్యాక్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నట్లు కనిపించాడు. కానీ, భువనేశ్వర్ కు ఆవకాశం దక్కలేదు. ఆ బాధను అతను భువనేశ్వర్ కుమార్ వినూత్న రీతిలో వ్యక్త పరిచాడు. నిజంగా తన మనసులో ఎంతో బాధ ఉంటేనే అలా చేసి ఉంటాడు అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. తన మనసులో తాను టీమిండియాలో భాగం కాలేకపోతున్నానే అనే బాధను మాత్రం దిగమింగుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. భువనేశ్వర్ కుమార్ కు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో గతంలో భువనేశ్వర్ కుమార్ అనే తన పేరు కింద “ఇండియన్ క్రికెటర్” అని ఉండేది. కానీ, ఇప్పుడు కేవలం ఇండియన్ అని మాత్రమే ఉంది.

వరల్డ్ కప్ లో కంబ్యాక్ కోసం భువనేశ్వర్ కుమార్ చాలానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపించాడు. కానీ, అతను అనుకున్నది జరగలేదు. అందుకే ఆ బాధతో అలా మార్చేశాడు అంటున్నారు. నిజానికి భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో ఎంతో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మొన్నటి వరకు వికెట్స్ పెద్దగా దక్కకపోయినా కూడా పరుగులు మాత్రం చాలా కంట్రోల్ చేశాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఏకంగా వింటేజ్ స్వింగ్ కింగ్ ని చూపించేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తర్వాత జట్టులో చోటు దక్కకపోవడంతో భువనేశ్వర్ ఎంతో బాధతో ఉన్నాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే భువనేశ్వర్ విషయంలో అభిమానులు కూడా అంతే నిరాశతో ఉన్నారు. భువీకి ఈ వరల్డ్ కప్ లో చోటు దక్కుంటే బాగుండేదని చెప్తున్నారు. మరి.. భువనేశ్వర్ కుమార్ మనసులో నిజంగానే బాధ ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోల తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş