SNP
SNP
వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ప్రిపేర్ అవుతున్న టీమిండియా వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో జరిగే సిరీస్‌లను ప్రాక్టీస్ మ్యాచ్‌లుగా, అలాగే టీమ్‌ని టెస్ట్ చేసేందుకు ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకుంటున్నారు. మిగతా ఆటగాళ్లకు గేమ్ టైమ్ ఇస్తూ.. వారికి జట్టులో చోటు కల్పిస్తున్నారు. కానీ, యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ దారుణంగా విఫలం అవుతున్నారు.
అందరి కంటే ముఖ్యంగా టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ భారీగా ఆశలు పెట్టుకుంది. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను వన్డేలకు అలవాటు చేసి.. వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్ కమ్ ఫినిషర్‌గా వాడుకోవాలని భావిస్తోంది. కానీ, సూర్య మాత్రం వారిని నిరాశపరుస్తూ వస్తున్నాడు. గత వన్డే సిరీస్‌లలోనూ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలం అయ్యాడు. అయినా కూడా అతనిపై బీసీసీఐ, కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకం ఉంచారు.
అయితే.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇస్తున్నారు. కానీ, సూర్య రెండు వన్డేల్లోనూ విఫలం అయ్యాడు. దీంతో అతన్ని వన్డే టీమ్ నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. ఈ బీసీసీఐ మాత్రం సూర్యను వన్డే టీమ్‌లో 6వ స్థానంలో ఆడించాలని భావిస్తోందటా. 6వ స్థానంలో అయితే ఫినిషర్‌గా టీ20 స్టైల్‌లో సూర్య ఫ్రీగా ఆడే అవకాశం ఉందని, అలాగే రిషభ్ పంత్ లేని లోటును కూడా సూర్య భర్తీ చేసే ఛాన్స్ ఉందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే సూర్య ఎన్నిసార్లు విఫలమైనా అతన్ని వన్డే టీమ్‌లో కొనసాగించేందుకే బీసీసీఐ బలంగా ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian management to try Suryakumar Yadav at 6 in ODI to maximise his T20 batting style. [The Indian Express] pic.twitter.com/0z4QZ9LmDp
— Johns. (@CricCrazyJohns) August 1, 2023
ఇదీ చదవండి: ‘అహంకారం ఎక్కువైంది’.. కపిల్ దేవ్ కామెంట్‌పై స్పందించిన జడేజా