SNP
Suryakumar Yadav, BCCI, Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలకు వ్యతిరేకంగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Suryakumar Yadav, BCCI, Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలకు వ్యతిరేకంగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
భారత టీ20 జట్టు కెప్టెన్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా బీసీసీఐ, సెలెక్టర్ల నిర్ణయాన్ని ఎదిరిస్తూ.. సూర్య షాకింగ్ ప్రకటన చేశాడు. రోహిత్ శర్మ వారుసుడిగా భారత టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్య.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో టీమిండియా విజయవంతంగా నడిపించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఏకంగా 3-0తో క్లీన్ స్వీప్ చేశాడు. అది కూడా యంగ్ టీమ్‌తో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిచి, జస్ప్రీత్ బుమ్రా రెస్లో ఉన్న సమయంలో యువ క్రికెటర్లతో వెళ్లి లంకను వాళ్ల గడ్డపైనే ఓడించాడు.
కెప్టెన్ సూపర్ సూపర్ స్టార్ట అందుకున్న తర్వాత.. శ్రీలంకపై టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు చూసి తట్టుకోలేకపోయాడో ఏమో కానీ.. సూర్య తాను మూడు ఫార్మాట్లు ఆడాలని అనుకున్నట్లు ప్రకటించాడు. టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న సూర్యను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతనిపై టీ20 బ్యాటర్ అనే ముద్ర పడింది. కానీ, డొమెస్టిక్ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న సూర్య.. తాను అన్ని ఫార్మాట్లు ఆడాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.
గంభీర్, బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా..
అయితే.. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం బీసీసీఐ, సెలెక్టర్ల ఆలోచనకు వ్యతిరేకంగా ఉంది. అది ఎలాగంటే.. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్ చేశారు. ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్‌ను కేవలం టీ20లకు పరిమితం చేసి, వన్డేలు, టెస్టులకు దూరంగా ఉంచాలని భావించింది. దానికి బీసీసీఐకి కూడా ఓకే చెప్పింది. వన్డే వరల్డ్ కప్ 2023లో సూర్యకు ఛాన్స్ ఇచ్చినా, అంతకు ముందు వన్డేలు ఎక్కువగా ఆడించినా అతను సక్సెస్‌కాలేదు. టీ20ల్లోనే బాగా ఆడుతున్నాడు. అందుకే టీ20లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అయినా కూడా సూర్య తాను మూడు ఫార్మాట్లు ఆడాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Suryakumar Yadav makes bold declaration after India’s ODI failure against Sri Lanka: ‘Want to play all three format’#SuryakumarYadav pic.twitter.com/iohMg4WqnW
— Sayyad Nag Pasha (@nag_pasha) August 10, 2024