iDreamPost
android-app
ios-app

వీడియో: SRHపై సెంచరీతో తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ చూడండి ఏం చేశాడో?

  • Published May 07, 2024 | 1:42 PM Updated Updated May 07, 2024 | 1:42 PM

Suryakumar Yadav, Devisha Shetty, SRH vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌.. మ్యాచ్‌ తర్వాత ఓ స్పెషల్‌ పర్సన్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Suryakumar Yadav, Devisha Shetty, SRH vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌.. మ్యాచ్‌ తర్వాత ఓ స్పెషల్‌ పర్సన్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 07, 2024 | 1:42 PMUpdated May 07, 2024 | 1:42 PM
వీడియో: SRHపై సెంచరీతో తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ చూడండి ఏం చేశాడో?

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి.. 31 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను తన పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌తో విజయాన్ని అందించాడు. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, నమన్‌ ధీర్‌ దారుణంగా విఫలమైనా.. పిచ్‌ నుంచి బౌలర్లకు అద్భుతమైన సపోర్ట్‌ లభిస్తున్నా స్టార్టింగ్‌లో కాస్త ఓపికగా ఆడి.. పిచ్‌ నుంచి స్వింగ్‌ లభించడం ఆగిపోయిన తర్వాత తనదైన స్టైల్‌లో చెలరేగాడు.

యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మతో కలిసి.. నాలుగో వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి ఈ సీజన్‌లో ఎంఐకి నాలుగో విజయం అందించాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సూర్య భాయ్‌. అయితే.. మ్యాచ్‌ తర్వాత.. స్టేడియంలోనే ఉన్న తన భార్య దేవిషా శెట్టికి వీడియో కాల్‌ చేసి.. తన సెంచరీ సంతోషాన్ని ఆమెతో పంచుకున్నాడు. భర్త సెంచరీ చేయడంతో దేవిషా శెట్టి కూడా చాలా హ్యాపీగా కనిపించింది. ఈ సీన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగుల ఫైటింగ్‌ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 48, కెప్టెన్‌ కమిన్స్‌ 35 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా, పీయూష్‌ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి.. మరో ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది. ఇషాన్‌ కిషన్‌ 9, రోహిత్‌ శర్మ 4, నమన్‌ ధీర్‌ 0 తక్కువ స్కోర్లకే అవుట్‌ అయ్యారు. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మతో కలిసి 143 పరుగుల పార్ట్నర్‌షిప్‌ నమోదు చేసి.. ఎంఐని గెలిపించారు. సూర్య్ 102, తిలక్‌ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌ తర్వాత సూర్య తన భార్యకు వీడియో కాల్‌ చేసి మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.