Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్లో హిట్‌మ్యాన్‌లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్లో హిట్‌మ్యాన్‌లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్లో హిట్‌మ్యాన్‌లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌తో పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు హిట్‌మ్యాన్. వచ్చే సంవత్సరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డేలకూ అతడు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అతడికి వారసుడ్ని వెతికే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. టెంపరరీగా ఒకట్రెండు సిరీస్‌లకు కాకుండా పూర్తి స్థాయి సారథిని నియమించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఆల్రెడీ ఓ ప్లేయర్‌ను కూడా సెలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ వారసుడుగా బీసీసీఐ డిసైడ్ అయిందని వినికిడి. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఇతర ఆప్షన్లు ఉన్నా సూర్యనే సారథిగా చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. హార్దిక్ నిత్యం గాయాలతో సావాసం చేస్తుంటాడు, ఈ మధ్యే కమ్‌బ్యాక్ ఇచ్చిన పంత్ కంటే కెప్టెన్‌గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మిస్టర్ 360 బెటర్ అని బీసీసీఐ అనుకుంటోందట. ఇంక గిల్, గైక్వాడ్ టీ20 టీమ్‌లో ఇంకా సెటిల్ అవ్వలేదు. కాబట్టి వాళ్లకు సారథ్యం ఇవ్వడం తొందరపాటు అవుతుందని భావిస్తోందట. గతంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో కెప్టెన్‌గా సూర్య తానేంటో ప్రూవ్ చేసుకోవడం కూడా అతడికి బిగ్ ప్లస్‌గా మారిందట. ఉన్న ఆప్షన్స్‌లో బెస్ట్ సూర్యనే అని బీసీసీఐతో పాటు కొత్త కోచ్ గౌతం గంభీర్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అక్కడ వన్డేలతో పాటు టీ20లు కూడా ఆడనుంది. ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే వన్డేలకు ఓ తాత్కాలిక సారథిని నియమించాల్సి ఉంటుంది. అయితే టీ20లకు మాత్రం పూర్తిస్థాయి కెప్టెన్‌ను ఎంపిక చేయాలి. అందుకే గంభీర్‌తో పాటు సెలెక్టర్లతో డిస్కస్ చేసిన బీసీసీఐ పెద్దలు సూర్యకుమార్‌ను ఆ రోల్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారట. త్వరలో సూర్య పేరును అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ వరకు అతడే కెప్టెన్‌గా ఉంటాడని సమాచారం. అయితే బోర్డు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. సూర్యకుమార్ కెప్టెన్‌గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Suryakumar Yadav strong contender to become India’s new T20i captain till 2026 T20 World Cup. (TOI). pic.twitter.com/SCGgtlfqLf
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2024