iDreamPost
android-app
ios-app

వీడియో: తల దించుకుని ఉండు.. తిలక్‌ వర్మకు సూర్యకుమార్‌ యాదవ్‌ వార్నింగ్‌!

  • Published Apr 14, 2024 | 1:36 PM Updated Updated Apr 14, 2024 | 1:36 PM

Suryakumar Yadav, Tilak Varma: తెలుగు కుర్రాడు, ముంబై ఇండియన్స్‌లో అదరగొడుతున్న తిలక్‌ వర్మకు ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తల దించుకోని ఉండాలంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Suryakumar Yadav, Tilak Varma: తెలుగు కుర్రాడు, ముంబై ఇండియన్స్‌లో అదరగొడుతున్న తిలక్‌ వర్మకు ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తల దించుకోని ఉండాలంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 14, 2024 | 1:36 PMUpdated Apr 14, 2024 | 1:36 PM
వీడియో: తల దించుకుని ఉండు.. తిలక్‌ వర్మకు సూర్యకుమార్‌ యాదవ్‌ వార్నింగ్‌!

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ టీమ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. సీజన్‌ ఆరంభంలో హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేసినా.. రెండు వరుస విజయాలతో విక్టరీ ట్రాక్‌ ఎక్కింది. ఆ స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీమ్‌లోకి అడుగుపెట్టిన వేళా విశేషం.. ముంబై విజయాల బాటపట్టింది. సూర్య రాకకంటే ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది పాండ్యా సేన. పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోవడంతో తొలి మూడు మ్యాచ్‌లకు స్కై దూరమమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయినా.. టీమ్‌ విజయం సాధించింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్య సూపర్‌ ఫిఫ్టీతో తన సత్తా చాటాడు.

అయితే.. టీమ్‌ సభ్యులతో సూర్య చాలా సరదాగా ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు, ముంబై ఇండియన్స్‌కు మిడిల్డార్‌లో వెన్నుముకగా మారిన తిలక్‌ వర్మను సూర్య దారుణంగా టీజ్‌ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ‍ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో.. సూర్య వెనక నుంచి వచ్చి.. తిలక్‌ వర్మ కళ్లు ముస్తాడు. కళ్లు ముసిన వ్యక్తి ఎవరో కనిపెట్టడం తిలక్‌కు ఉన్న టాస్క్‌. ఈ టాస్క్‌లో గెలిచేందుకు తిలక్‌ వర్మ చాలా ప్రయత్నిస్తాడు. కానీ, చివరి రాంగ్‌ ఆన్సర్‌ ఇస్తాడు. దీంతో.. కళ్లపై నుంచి చేతులు తీసిన సూర్య.. తిలక్‌ పరువు తీస్తాడు.

ఇలా అయితే.. ఎలా నువ్వే గుండావి అవుతారా అంటూ తిలక్‌ను అంటాడు సూర్య. రాంగ్‌ ఆన్సర్‌ చెప్పినందుకు, సొంత టీమ్‌ ప్లేయర్‌ని, మూడేళ్లుగా కలిసి ఆడుతున్న నన్ను గుర్తుపట్టలేకపోయావు.. కెమెరా ముందు తల దించుకుని ఉంటూ అంటూ తిలక్‌కు సూర్య సరదాగా వార్నింగ్‌ ఇస్తాడు. ఈ ఫన్నీ వీడియో చూసి.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇన్ని రోజులు ముంబై ఇండియన్స్‌లో ఇలాంటి వాతావరణం మిస్‌ అయిందని, సూర్య రాకతో ఇక సందడే సందడి ఉంటుందంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయినా.. సూర్య ఒక్క తిలక్‌తోనే కాదు.. జట్టులోని ఆటగాళ్లందరితోనూ ఇలానే చాలా సరదాగా ఉంటాడు. మరి సూర్య, తిలక్‌ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş