Nidhan
పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై.
పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై.
Nidhan
పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. సౌతాఫ్రికా పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు స్కై. సిక్స్ వెళ్తున్న బాల్‌ను గాల్లోకి ఎగిరి అందుకున్నాడు సూర్య. అయితే బాడీ బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ లైన్ దాటాల్సి వచ్చింది. అయితే తెలివిగా ముందే బాల్‌ను ముందే గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత మళ్లీ లోపలకు వచ్చి దాన్ని అందుకున్నాడు. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ క్యాచ్‌పై ఎన్నో వివాదాలు నడిచాయి. సూర్య క్యాచ్ సరికాదని, బౌండరీ రోప్‌ను అతడు టచ్ అయ్యాడని కొందరు విమర్శిస్తే.. ఫోర్ లైన్‌ను కావాలని జరిపారని, ఇది మోసమని మరికొందరు ఆరోపణలు గుప్పించారు.
అంపైర్లు మ్యాచ్ టైమ్‌లో సూర్య క్యాచ్‌ను నిశితంగా పరిశీలించాల్సిందని, ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే నిర్ణయాన్ని వెల్లడించడం కరెక్ట్ కాదని ఇంకొందరు కామెంట్స్ చేశారు. అయితే ఆ క్యాచ్ కరెక్టే అని చెప్పడానికి ఆ తర్వాత మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి. మాజీ క్రికెటర్స్, ఎక్స్పర్ట్స్ అది క్లీన్ క్యాచ్ అని చెప్పడం, వీడియోల్లోనూ అదే తేలడంతో ఆ కాంట్రవర్సీ అక్కడితో సద్దుమణిగింది. ఇక, ఒక్క క్యాచ్‌తో టీమిండియాకు హీరోగా మారిన సూర్యకుమార్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతడు పట్టింది క్యాచ్ కాదు.. వరల్డ్ కప్ ట్రోఫీ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ క్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ తరుణంలో ఫైనల్ క్యాచ్‌పై సూర్య రియాక్ట్ అయ్యాడు. దీన్ని మించిన క్యాచ్ ఒకటి ఉందన్నాడు.
మిల్లర్ ఇచ్చిన క్యాచ్ తన లైఫ్‌లో మరీ ముఖ్యమైనది కాదని సూర్య అన్నాడు. తన భార్య దేవిశా శెట్టిని మ్యారేజ్ చేసుకోవడం జీవితంలో ఎంతో కీలకమైన క్యాచ్ అని అతడు రివీల్ చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో మిల్లర్ ఇచ్చిన క్యాచ్ అందుకొని ఎనిమిది రోజులు అవుతోందని.. కానీ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన క్యాచ్ పట్టి 8 సంవత్సరాలు అవుతోందంటూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు స్కై. భార్య దేవిశాతో దిగిన పలు ఫొటోలను అందరితో పంచుకున్నాడు. సూర్య-దేవిశా పెళ్లై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద కేక్‌ను కట్ చేసిన ఈ కపుల్.. ఆ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్స్.. ఈ అందమైన జంటకు మ్యారేజ్ డే విషెస్ చెబుతున్నారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. సూర్య భారత్‌కు మరిన్ని కప్పులు అందించాలని కామెంట్స్ చేస్తున్నారు.