Suryakumar Yadav: వివాదాస్పద క్యాచ్ పై స్పందించిన సూర్యకుమార్! ఈ ఆన్సర్ ఊహించలేదు..

Suryakumar Yadav: వివాదాస్పద క్యాచ్ పై స్పందించిన సూర్యకుమార్! ఈ ఆన్సర్ ఊహించలేదు..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇక ఈ క్యాచ్ పై వివిధ రకాలుగా స్పందించారు ప్రముఖ క్రికెటర్లు. తాజాగా ఈ క్యాచ్ పై రియాక్ట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ గురించి స్కై ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇక ఈ క్యాచ్ పై వివిధ రకాలుగా స్పందించారు ప్రముఖ క్రికెటర్లు. తాజాగా ఈ క్యాచ్ పై రియాక్ట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ గురించి స్కై ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ టీమిండియా సొంతం కావడంలో సూర్యకుమార్ పాత్ర కీలకమైంది. ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూపర్ మ్యాన్ లా ఎంతో అద్భుతంగా ఎగిరి పట్టాడు సూర్య. అయితే ఈ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. క్యాచ్ పట్టే సమయంలో స్కై కాలు బౌండరీలైన్ కు తాకిందని కొందరు వాదిస్తే.. అది కచ్చితమైన ఔట్ అని సూర్యను ప్రశంసల్లో ముంచెత్తారు ఇంకొందరు. ఇక ఈ క్యాచ్ పై తాజాగా స్పందించాడు సూర్యకుమార్ యాదవ్. ఊహించని ఆన్సర్ ఇచ్చాడు స్కై. ఇంతకీ అతడు ఏం చెప్పాడో తెలుసా?

టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలవడానికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కీలకమైంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయానికి చివరి ఓవర్లో 16 రన్స్ అవసరం కాగా.. హార్దిక్ పాండ్యా బంతిని అందుకున్నాడు.  అయితే తొలి బంతికే సిక్సర్ కొట్టే ప్రయత్నంలో భారీ షాట్ కు ప్రయత్నించాడు డేవిడ్ మిల్లర్. అయితే అందరూ ఆ బంతి సిక్సర్ వెళ్తుందని భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన స్కై తనను తాను నిలవరించుకుంటూ.. పట్టిన క్యాచ్ తో టీమిండియా విజయం ఖాయం అయ్యింది.

అయితే ఈ క్యాచ్ పెద్ద వివాదానికి దారితీసింది. క్యాచ్ పట్టినప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీలైన్ కు తాకిందని కొందరు మాజీలు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అంపైర్లు కూడా టీమిండియాకే సపోర్ట్ గా నిలిచారని ఆరోపించారు. అయితే ఈ వివాదాస్పద క్యాచ్ పై ఎట్టకేలకు స్పందించాడు సూర్యకుమార్ యాదవ్. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..”నేను క్యాచ్ అందుకునే సమయంలో నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవూ. అసలు ఏం జరగుతుందో కూడా తెలీదు. ఎగురుతున్న ప్రపంచ కప్ ను చూస్తున్నాను.. దాన్ని పట్టుకున్నాను అంతే” అని ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ తోనే టీమిండియాకు విజయం దాదాపు ఖాయమైంది. మరి వివాదాస్పద క్యాచ్ పై సూర్య స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments