Suryakumar Yadav: కొత్త అవతారంలో సూర్యకుమార్​.. గంభీర్ ప్రయోగం వర్కౌట్ అయ్యేనా?

లంకతో సిరీస్ మొదలవడానికి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త అవతారం ఎత్తాడు. అతడితో కోచ్ గౌతం గంభీర్ చేస్తున్న ప్రయోగం వర్కౌట్ అయితే లంకకు దబిడిదిబిడే.

లంకతో సిరీస్ మొదలవడానికి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త అవతారం ఎత్తాడు. అతడితో కోచ్ గౌతం గంభీర్ చేస్తున్న ప్రయోగం వర్కౌట్ అయితే లంకకు దబిడిదిబిడే.

భారత్-శ్రీలంక సిరీస్​కు అంతా రెడీ అయిపోయింది. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ సిరీస్​కు రేపు జరిగే మొదటి టీ20తో తెరలేవనుంది. మొత్తంగా ఈ సిరీస్​లో మూడు టీ20 మ్యాచులతో పాటు మూడు వన్డేలు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. టీ20 సిరీస్ కోసం భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. నెట్స్​లో ఆటగాళ్లంతా చెమటలు చిందిస్తున్నారు. బౌలర్లు లాంగ్ స్పెల్స్ బౌలింగ్ వేస్తూ అక్కడి కండీషన్స్​కు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాటర్లు భారీ షాట్లు సాధన చేస్తున్నారు. అందరూ కలసి స్పెషల్ ఫీల్డింగ్ డ్రిల్​లో కూడా పాల్గొన్నారు. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్​ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా క్యాచ్​లు పట్టుకోవడం, రనౌట్లు చేయడంపై ఫోకస్ పెట్టారు. సంజూ శాంసన్, రిషబ్ పంత్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

సిరీస్ మొదలవడానికి ముందు దొరికిన తక్కువ గ్యాప్​ను కూడా ప్రాక్టీస్ కోసం పర్ఫెక్ట్​గా వినియోగించుకుంది భారత్. స్పెషల్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ సెషన్స్ నిర్వహించి ఆటగాళ్ల టెక్నిక్​ను సరిదిద్దడం, వాళ్ల బెస్ట్​ను బయటకు తీసుకురావడంపై కోచ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు. అదే సమయంలో కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​తో పాటు స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యాతో కొత్త అవతారాలు ఎత్తించాడు గౌతీ. పేస్ బౌలర్ అయిన పాండ్యా.. నెట్స్​లో లెగ్ స్పిన్ డెలివరీస్ వేస్తూ కనిపించాడు. సూర్య ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో అసలు గంభీర్ ప్లాన్ ఏంటి? వీళ్లిద్దరితో కోచ్ ఏ ప్రయోగం చేయబోతున్నాడని అందరూ ఆలోచనల్లో పడ్డారు.

ప్రాక్టీస్ సెషన్​లో సూర్య, హార్దిక్ విషయంలో గంభీర్ ఓ స్ట్రాటజీతో వ్యవహరించాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీ20ల్లో టీమ్​కు అదనపు బౌలర్ అవసరం ఉంది. సిక్స్ బౌలర్​ వచ్చి ఒకట్రెండు ఓవర్లు వేస్తే టీమ్​కు బిగ్ ప్లస్ ​అవుతుంది. అందులో భాగంగానే సూర్యతో గంభీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడని సమాచారం. అప్పట్లో భారత జట్టులో బ్యాటర్లు కూడా బౌలింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు టాప్-5లో ఒక్కరు కూడా చేయి తిప్పడం లేదు. అందుకే బ్యాటర్లతో గౌతీ బౌలింగ్ సాధన చేయిస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు హార్దిక్​ బౌలింగ్​లో మరింత వేరియేషన్స్ తీసుకురావడం కోసం అతడితో లెగ్ స్పిన్ డెలివరీస్ వేయించాడనే అంటున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం గనుక సక్సెస్ అయితే మన బౌలింగ్ యూనిట్ మరింత బలోపేతం అవడం గ్యారెంటీ అనే కామెంట్స్ వస్తున్నాయి.

Show comments