SNP
Suryakumar Yadav, IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్ అద్భుతంగా వేసి హీరో అయ్యాడు. కానీ అదే ఓవర్‌లో అతను పెద్ద తప్పు చేశాడు. మ్యాచ్ ఓడిపోతే విలన్ అయ్యేవాడు. మరి ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
Suryakumar Yadav, IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్ అద్భుతంగా వేసి హీరో అయ్యాడు. కానీ అదే ఓవర్‌లో అతను పెద్ద తప్పు చేశాడు. మ్యాచ్ ఓడిపోతే విలన్ అయ్యేవాడు. మరి ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
సూర్యకుమార్ యాదవ్.. టీ20 కెప్టెన్‌గా సూపర్ స్టార్ట్ అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్యకుమార్ యాదవ్‌ను కొత్త కెప్టెన్ ప్రకటించింది బీసీసీఐ. గతంలో కొన్ని మ్యాచ్‌లకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించినా.. అప్పుడు తాతాల్కిక కెప్టెన్ మాత్రమే. కానీ, పర్మినెంట్ కెప్టెన్ అయిన తర్వాత.. ఇదే సూర్యకు ఫస్ట్ సిరీస్. కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయ్యాడు. విదేశీ గడ్డపై కెప్టెన్ తొలి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి.. కెప్టెన్‌గా తన జర్నీకి జీవతకాలం గుర్తిండిపోయే మైలురాయి వేసుకున్నాడు.
అయితే.. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో సూర్య బ్యాట్‌తో కాకుండా బాల్ మెరిసిన విషయం తెలిసిందే. శ్రీలంక విజయానికి చివరి ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో బాల్ అందుకుని అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎలాగో ఓడిపోయే మ్యాచ్ కదా.. అందుకే సరదాగా బౌలింగ్ చేస్తున్నాడని చాలా మంది భావించారు. కానీ, తాను సరదాగా బౌలింగ్‌కు దిగలేదని, మ్యాచ్ గెలిపించాలనే బౌలింగ్‌కు వచ్చినట్లు సూర్య నిరూపించాడు. కానీ, మ్యాచ్ ఓడిపోయి ఉంటే.. సూర్య విలన్ అయ్యేవాడు. ఎందుకంటే.. చివరి ఓవర్ తొలి నాలుగు బంతుల్లో కేవలం ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి.. విజయంపై ఆశలు రేపాడు సూర్య.
ఇక శ్రీలంకకు చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాలి. లంక ఈజీగా గెలుస్తుందనే పరిస్థితి నుంచి.. ఏమైనా జరగొచ్చు.. మ్యాచ్ ఎవరైనా గెలవచ్చు అనే స్థితికి తెచ్చాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సూర్య వేసిన ఐదో బంతిని లంక బ్యాటర్ చమిందు విక్రమసింఘే లాంగ్ ఆఫ్ వైపు కొట్టాడు. ఒక్క పరుగు వచ్చే చోటు రెండో రన్ కోసం లంక బ్యాటర్లు పరిగెత్తారు. లాంగ్ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్ రియాన్ పరాగ్ నుంచి సూర్యకు వేగంగా త్రో వచ్చింది. బాల్ అందుకొని వికెట్లకు కొట్టి ఉంటే.. నాన్‌స్టైకర్ అవుట్ అయి ఉండేవాడు. సూర్య బాల్ అందుకున్న సమయానికి నాన్‌స్టైకర్ అసలు ఫ్రేమ్‌లో కూడా లేడు. కానీ, ఆ విషయం గమనించని సూర్య.. బాల్ అందుకొని.. వికెట్ కీపర్ వైపు త్రో విసిరాడు.. అప్పటికే చమిందు విక్రమసింఘే క్రీజ్‌లోకి చేరుకున్నాడు.
దాంతో.. లంకకు రెండు రన్స్ ఈజీగా వచ్చేశాయి. ఇక చివరి బాల్‌కు 3 రన్స్ అవసరమైన సమయంలో మరో డబుల్‌తో లంక మ్యాచ్‌ను టై చేసుకోగలిగింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో ఇండియా గెలవడంతో సూర్య చేసిన తప్పు పెద్దగా హైలెట్ కాలేడు. ఒక వేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే.. మాత్రం సూర్య చేసిన తప్పు హైలెట్ అయ్యేది. ఇప్పుడు హీరో అయిన సూర్య.. అప్పుడు విలన్ అయి ఉండే వాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Suryakumar Yadav Missed Run Out in last over when sri lanka need 5 runs in 2 balls #INDvsSL #SuryakumarYadav pic.twitter.com/nr4EV4m6AF
— Sayyad Nag Pasha (@nag_pasha) July 31, 2024
Surya Kumar Yadav’s last over. The game changer! #SLvIND pic.twitter.com/Y4ZZ1Am1YR
— Abhishek ✨ (@ImAbhishek7_) July 30, 2024