Suryakumar Yadav: స్వదేశానికి టీమిండియా.. సూర్యకుమార్ మాస్ డ్యాన్స్ చూశారా? వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. సగర్వంగా స్వదేశంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ వీరులకు ఘన స్వాగతం పలికారు అధికారులు, అభిమానులు. ఈ క్రమంలో తన మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. సగర్వంగా స్వదేశంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ వీరులకు ఘన స్వాగతం పలికారు అధికారులు, అభిమానులు. ఈ క్రమంలో తన మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ సాధించిన ఛాంపియన్స్ స్వదేశానికి విచ్చేశారు. గురువారం ఉదయం న్యూ ఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు బీసీసీఐ అధికారులు, అభిమానులు. ప్రపంచ విజేతలకు స్వాగతం పలికేందుకు భారీగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి బయటకి వస్తున్న ఆటగాళ్లకు సగర్వంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్ కు చేరుకున్నారు. హోటల్ దగ్గర దిగిన ప్లేయర్లకు డప్పుచప్పుల్లతో గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ఇక ఆ డప్పుల దరువుకు మాస్ డ్యాన్స్ చేశాడు టీమిండియ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీ20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచే అభిమానులు నీరాజనాలు పలికారు. వరల్డ్ కప్ ను చూపిస్తూ.. కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చేశాడు. ఇక అక్కడి నుంచి బస్సులో బయలుదేరి.. ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు ఆటగాళ్లు. ఆ హోటల్ దగ్గర డప్పు చప్పుల్లతో సంప్రదాయ బద్దమైన స్వాగతం లభించింది.

ఈ క్రమంలోనే డప్పు దరువుకు టీమిండియా స్టార్ క్రికెటర్ మాస్ డ్యాన్స్ వేశాడు. కళాకారులతో కలి ఆ దరువుకు అనుగుణంగా వారితో కలిసి చిందేశాడు. పక్కనే ఉన్న యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ సైతం చిందులు వేశాడు. సూర్యకుమార్ డ్యాన్స్ చేయడంతో.. సెలబ్రేషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సూర్య భాయ్ నువ్వు తోపు డ్యాన్సర్ వి.. నీ మాస్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయాం అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టి టీమిండియాకు కప్ ను అందించాడు సూర్య. మరి సూర్య మాస్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments