SNP
SNP
ప్రపంచ క్రికెట్‌లో మిస్టర్ 360 సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అయితే.. ఇండియాకు మాత్రం సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360. లేటు వయసులో టీమిండియాలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. సంచలన బ్యాటింగ్‌తో టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. అయితే.. సూర్యను టీ20లతో పాటు వన్డేల్లోనూ కీ ప్లేయర్‌గా ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంత ప్రయత్నిస్తున్న సూర్యకుమార్ మాత్రం వన్డేల్లో సక్సెస్ కాలేకపోతున్నాడు సరికదా తనకు అచ్చొచ్చిన టీ20ల్లోనూ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముంచుకు వస్తున్న నేపథ్యంలో సూర్య ఫామ్ క్రికెట్ అభిమానులను ఆందోళన పరుస్తోంది.
వన్డేల్లో సూర్య విఫలం అయ్యాడంటే సరే అనుకోవచ్చు. అతను టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ, టీ20ల్లోనూ సూర్య దారుణంగా విఫలం అవుతున్నాడు. అది కూడా ఓ పసికూన జట్టులా మారిన వెస్టిండీస్‌పై. మరో భయంకరమైన నిజం ఏంటంటే.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఇదే కరేబియన్ గడ్డపై జరగనుంది. ఇప్పుడు సూర్య ఈ పిచ్‌లపై ఆడి ఆత్మవిశ్వాసం పెచ్చుకోకపోతే.. అదే ఫెయిల్యూర్ కొనసాగే అవకాశం ఉంది. పైగా అప్పటి వరకు సూర్య కెరీర్ కూడా దగ్గర పడొచ్చు ఎందుకంటే.. ఇప్పటికే సూర్య మూడు పదుల వయసు దాటేశాడు. ఎక్కువ కాలం ఆటలో కొనసాగడం కూడా కూడా కష్టం.
అలాగే.. సూర్య బ్యాటింగ్‌పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు సూర్య బ్యాటింగ్ ఆహా ఓహో అన్నొళ్లు కూడా అతనిది అడ్డిగుడ్డి బ్యాటింగా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదో లక్కుకొద్ది టైమ్ కలిసొస్తే ఆడేస్తాడు కానీ, టీమ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడటం, నిలకడ ప్రదర్శించడం అతనికి రాదని అంటున్నారు. కాగా.. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సూర్య చేసిన స్కోర్లు ఒకసారి పరిశీలిస్తే.. 19, 24, 35, 21, 1… కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అన్ని కలిపితే సరిగ్గా 100 పరుగులు చేశాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి అతను చేసింది కేవలం వంద పరుగులు మాత్రమే. అందులో మూడు వన్డేలు కూడా ఉన్నాయి. వాటిలో టైమ్ తీసుకుని ఆడే ఛాన్స్ కూడా ఉంది. కానీ, సూర్య మాత్రం దారుణంగా విఫలం అయ్యాడనే చెప్పాలి. మరి సూర్య ప్రస్తుతం ఉన్న ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Will Surya get another chance in ODI’s ?#suryakumaryadav #sky #indiancricketteam #indvswi pic.twitter.com/yED7DqrLfI
— Cricket Addictor (@AddictorCricket) August 2, 2023
ఇదీ చదవండి: వన్డే వరల్డ్ కప్‌తో రోహిత్ శర్మ! దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే?