iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టుకు కొత్త కెప్టెన్!

  • Author Soma Sekhar Updated - 10:32 AM, Tue - 21 November 23

నవంబర్ 23 నుంచి వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది టీమిండియా. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

నవంబర్ 23 నుంచి వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది టీమిండియా. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

  • Author Soma Sekhar Updated - 10:32 AM, Tue - 21 November 23
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టుకు కొత్త కెప్టెన్!

ప్రపంచ కప్ ఓటమి నుంచి తేరుకోక ముందే టీమిండియా మరో సమరానికి సిద్దం కావాల్సి ఉంది. నవంబర్ 23 నుంచి వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది టీమిండియా. ఈ సిరీస్ నెగ్గి వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది భారత జట్టు. ఇందుకోసం జట్టులో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది టీమ్ మేనేజ్ మెంట్. ఈ సిరీస్ పై చర్చించేందుకు సోమవారం అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు సెలక్టర్లు. సమావేశంలో భాగంగా టీమిండియాకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఆ నూతన సారథి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 5 టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం టీమిండియా నూతన కెప్టెన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. సోమవారం అహ్మదాబాద్ లో భేటీ అయిన సెలక్టర్లు ఆసీస్ తో జరిగే టీ20 సిరీస్ కోసం కెప్టెన్ గా మిస్టర్ 360 సూర్య కుమార్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇక ఈ సమావేశంలో యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరును కూడా పరిశీలించగా.. కొందరు అతడి వైపు మెుగ్గుచూపారు. కానీ చివరికి సూర్యనే సారథిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్లేయర్ల విషయానికి వస్తే.. సీనియర్లు అయిన రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో.. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ కు ఈ అవకాశం దక్కింది. త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు సెలక్టర్లు. మరి టీ20 సిరీస్ కు కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.