Suryakumar Yadav: విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును సమం చేసిన సూర్యకుమార్! ఇది చాలా స్పెషల్..

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన అర్ధశతకంతో అలరించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును సమయం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన అర్ధశతకంతో అలరించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును సమయం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. అదే జోరును సూపర్ 8 లో భాగంగా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చూపించాడు. అయితే యూఎస్ఏ మ్యాచ్ లో తన శైలికి భిన్నంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆడిన స్కై.. ఈ మ్యాచ్ లో మాత్రం తన మార్క్ షోతో అలరించాడు. పాత సూర్యను గుర్తుచేస్తూ.. 27 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. మెుత్తంగా ఈ మ్యాచ్ లో 28 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డు ను సమం చేశాడు సూర్య. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ 8లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జట్టులో సూర్యకుమార్(53), హార్దిక్ పాండ్యా(32) పరుగులతో రాణించారు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారుఖీ, రషీద్ ఖాన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్గాన్ ను జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఓ ఆటాడుకున్నారు. దాంతో 134 పరుగులకే ప్రత్యర్థి చాపచుట్టేసింది. దాంతో 47 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది భారత జట్టు. బుమ్రా, అర్షదీప్ తలా 3 వికెట్లు తీసి.. ఆఫ్గాన్ పతనాన్ని శాసించారు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో  ఓ క్రేజీ రికార్డ్ ను సమం చేశాడు టీమిండియా మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించిన సూర్యకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్ దక్కించుకోవడం ద్వారా టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు స్కై. అంతర్జాతీయ టీ20ల్లో 120 మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. సూర్యకుమార్ కూడా తాజాగా అందుకున్న అవార్డ్ తో కలిసి 15 సార్లు ఈ ఘనతను సాధించాడు. దాంతో కోహ్లీ సరసన నిలిచాడు. అయితే స్కై కేవలం 64 మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం. కాగా.. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ 7 సార్లు ఈ అవార్డ్ అందుకుంటే.. సూర్య 3 సార్లు ఈ అవార్డ్ తీసుకున్నాడు. ఇక ఈ  జాబితాలో సూర్య, కోహ్లీ తర్వాత విరందీప్ సింగ్(78 మ్యాచ్‌లు), సికిందర్ రాజా(86 మ్యాచ్‌లు), మహమ్మద్ నబీ(126 మ్యాచ్‌ల్లో) 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్  అందుకున్నారు. మరి కోహ్లీ క్రేజీ రికార్డ్ ను సూర్యకుమార్ సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments