iDreamPost
android-app
ios-app

World Cup 2023: టీమిండియాలో అతనే కచరా! సూర్యకుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Published Nov 01, 2023 | 4:15 PM Updated Updated Nov 01, 2023 | 4:15 PM

టీమిండియాలో అతనే కచరా అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్న సూర్య.. తర్వాత ఓ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. మరి టీ మిండియాలో ఉన్న ఆ కచరా ఎవరో చూద్దాం..

టీమిండియాలో అతనే కచరా అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్న సూర్య.. తర్వాత ఓ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. మరి టీ మిండియాలో ఉన్న ఆ కచరా ఎవరో చూద్దాం..

  • Published Nov 01, 2023 | 4:15 PMUpdated Nov 01, 2023 | 4:15 PM
World Cup 2023: టీమిండియాలో అతనే కచరా! సూర్యకుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌

భారత జట్టు ప్రస్తుతం భయంకరమైన ఫామ్‌లో ఉంది. వరల్డ్‌ కప్‌ 2023లో ఎదురుగా ఏ జట్టు వచ్చిన తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ఇలానే మరో ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయం. ఇప్పటికే 1983, 2011లో వరల్డ్‌ కప్‌ గెలిచి.. వరల్డ్‌ ఛాంపియన్స్‌ అయిన టీమిండియా.. మళ్లీ అలాంటి అద్భుత క్షణాలను, విజయాన్ని భారత క్రికెట్‌ అభిమానులకు ఇచ్చేందుకు ఉవ్విళ్లు ఊరుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. అన్నింట్లో విజయాలు సాధించి.. సంచలన ప్రదర్శనతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. టీమిండియాలోని స్టార్‌ ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, షమీ ఇలా అందరూ సూపర్‌ఫామ్‌లో ఉన్నారు.

వీరితో పాటు మరో కీలక ప్లేయర్‌.. జట్టులో ఉన్న వన్‌ అండ్‌ ఓన్లీ క్వాలిటీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అతను కూడా ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇక వరల్డ్‌ కప్‌కి ముందు ఇతన్ని ఎందుకు ఎంపిక చేశారని విమర్శలు ఎదుర్కొన్న సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇంగ్లండ్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 49 పరుగుల చేసి అవుట్‌ అయినా.. కోహ్లీ, గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జడేజా ఇలా స్టార్లంతా విఫలమైన సమయంలో ఆ ఇన్నింగ్స్‌ జట్టుకు ఎంతో ఉపయోగపడింది. కాగా, ఆ మ్యాచ్‌లో సూర్య చేసిన ఓ కామెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌ మధ్యలో సూర్య.. కుల్దీప్‌ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వె మా కచరా అంటూ పేర్కొన్నాడు. కచరా అంటూ తిట్టు అనుకుంటున్నారేమో.. కాదులేండి. అందో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌. 2001లో విడుదలై.. సూపర్‌ హిట్‌గా నిలిచిన లగాన్‌ అనే హిందీ సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమీర్‌ఖాన్‌ హీరోగా.. క్రికెట్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా వచ్చిన ఆ సినిమాలో ఓ వ్యక్తి చేయి వంకగాగా ఉంటుంది. అతని పేరే కచరా. అతను బాల్‌ వేస్తే.. ఊహించని విధంగా బాల్‌ స్పిన్‌ అవుతుంది. అప్పట్లో దాన్ని స్పిన్‌ బౌలింగ్‌ అని తెలియని హీరో.. భలే వేస్తున్నాడని అతన్ని కూడా టీమ్‌లో తీసుకుని.. బ్రిటీష్‌ వాళ్లతో జరిగిన మ్యాచ్‌లో ఆడించి.. వికెట్లు తీయిస్తాడు. ఇప్పుడు కూడా ఇంగ్లండ్‌తోనే మ్యాచ్‌ కావడం, కుల్దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను అవుట్‌ చేయడంతో.. సూర్య ఈ విధంగా పేర్కొన్నాడు. లగాన్‌ టీమ్‌లో ఉన్నట్లు నువ్వు టీమిండియాలో ఉన్న కచరా అని మెరాకిల్స్‌ చేస్తావని సరదాగా పేర్కొన్నాడు. సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మరి సూర్య చేసిన కామెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.