Nidhan
వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న స్టార్ ఆల్‌రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు.
వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న స్టార్ ఆల్‌రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు.
Nidhan
వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న స్టార్ ఆల్‌రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు. అనంత్ అంబానీ మ్యారేజ్ ఈవెంట్ ముగిశాక సొంతూరైన వడోదరకు పయనమయ్యాడు పాండ్యా. భారత జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌కు వడోదర ప్రజలు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. జాతీయ జెండాలు చేతపట్టి వేలాది మంది అతడికి స్వాగతం పలికారు. ఓపెన్ బస్‌లో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కలిలాడు పాండ్యా. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్ ఆడి అలసిపోయిన అతడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో గాయపడిన హార్దిక్ పాండ్యా.. ఇంజ్యురీ కారణంగా చాన్నాళ్లు టీమిండియాకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. క్యాష్ రిచ్ లీగ్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఆడి అలసిపోయిన అతడు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. శ్రీలంక సిరీస్‌తో అతడు మళ్లీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయనున్నాడు. అయితే పాండ్యాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి కప్పు ఫైనల్‌తో అతడు ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. దీంతో టీ20లకు కొత్త సారథిని నియమించే పనిలో ఉంది బీసీసీఐ. లంకతో సిరీస్ ద్వారా పర్మినెంట్ టీ20 కెప్టెన్‌ను అనౌన్స్ చేయాలని చూస్తోంది.
టీ20 కెప్టెన్‌గా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసిందని తెలుస్తోంది. పలు సిరీస్‌ల్లో జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపిన అనుభవం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతడి వ్యక్తిత్వం నచ్చి సారథ్య పగ్గాలు ఇచ్చేందుకు బోర్డు రెడీ అయిందట. సెలెక్టర్లతో పాటు కోచ్ గంభీర్‌తో డిస్కస్ చేశాకే ఈ నిర్ణయానికి వచ్చారని టాక్ నడుస్తోంది. దీంతో హార్దిక్‌కు అన్యాయం చేశారనే విమర్శలు వస్తున్నాయి. పొట్టి ప్రపంచ కప్‌లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాను కాదని.. సూర్యను కెప్టెన్ చేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గంభీర్ తీసుకున్న నిర్ణయమే హార్దిక్‌కు శాపంగా మారిందని తెలుస్తోంది.
పాండ్యాను మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలని గౌతీ డిసైడ్ అయ్యాడని సమాచారం. అయితే నిత్యం గాయాలతో సావాసం చేసే హార్దిక్‌కు ఇంజ్యురీ అయితే మళ్లీ టీ20లకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుందని బోర్డు భయపడుతోందట. అతడి వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని వన్డేలు, టీ20ల్లో మాత్రమే ఆడే సూర్యను సారథ్యానికి బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు వినికిడి. పాండ్యాను వన్డేలు, టీ20లకే పరిమితం చేస్తే అతడే కెప్టెన్ అయ్యేవాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి.. హార్దిక్‌ను కాదని సూర్యను సారథిగా ఎంచుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
The fitness concerns and workload management may have tipped the scales against Hardik Pandya about Team India’s T20I Captaincy. (ESPNcricinfo). pic.twitter.com/QPQWpPnmhy
— Tanuj Singh (@ImTanujSingh) July 17, 2024